BigTV English

Heavy Rain in Hyderabad: వరద కష్టాలకు చెక్‌..! మాన్సూన్‌ యాక్షన్ ప్లాన్ రెడీ.. రంగంలోకి 400 టీమ్స్

Heavy Rain in Hyderabad: వరద కష్టాలకు చెక్‌..! మాన్సూన్‌ యాక్షన్ ప్లాన్ రెడీ.. రంగంలోకి 400 టీమ్స్

Heavy Rain in Hyderabad: ఒక్కవర్షానికే బెంగళూరు అల్లకల్లోలమైంది. ముగ్గురు చనిపోయారు. మరి హైదరాబాద్ పరిస్థితి ఏంటి.. ఈసారి ముందుగానే నైరుతి రుతు పవనాలు వచ్చేస్తున్నాయి. భాగ్యనగరంలో భారీవర్షం పడితే పరిస్థితి ఏంటి? అధికార యంత్రాంగం తీసుకుంటున్న జాగ్రత్తలు ఎంత వరకు వచ్చాయి? గ్రేటర్ వ్యాప్తంగా ఎన్ని వాటర్ లాగిన్ పాయింట్స్ ఉన్నాయి? హైడ్రా యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది?


వర్షాలకు వణికిపోయిన బెంగళూరు

మే 18, 19 తేదీల్లో బెంగళూరులో కురిసిన భారీ వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు నీరు చేరింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శాంతినగర్‌లోని BMTC బస్సు డిపోలో నడుములోతు నీరు నిలిచి, బస్సుల రాకపోకలు ఆగిపోయాయి. 24 గంటల్లో 4 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడంతో ఒక్కసారిగా బెంగళూరు వణికిపోయింది. రెస్క్యూ బృందాలు పడవల్లో వెళ్లి రెస్క్యూ చేయాల్సి వచ్చింది. చూశారుగా ఇదీ బెంగళూరు సీన్..


మన దగ్గర భారీ వర్షాలు పడితే పరిస్థితి ఏంటి?

ఇప్పుడు హైదరాబాద్ విషయానికొద్దాం. మన దగ్గర భారీ వర్షాలు పడితే పరిస్థితి ఏంటి? హైడ్రా, GHMC ఎంత వరకు రెడీగా ఉన్నాయి. హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద వరద నివారణ కోసం నిర్మిస్తున్న రెయిన్ వాటర్ సంప్ పనులను సీఎం రేవంత్ రెడ్డి గతేడాది డిసెంబర్ 2న స్వయంగా పరిశీలించారు. ఆ సందర్భంగా వరద నివారణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై వరదను మళ్లిస్తే నగరంలో ట్రాఫిక్ జామ్‌లను తగ్గించవచ్చని సూచించారు.

141 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర సంపులు

వచ్చే వర్షాకాలం నాటికి అన్నీ చోట్ల పనులు పూర్తి చేయాలని 5 నెలల క్రితమే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రైయిన్ వాటర్ సంప్‌ల డిజైన్ మార్చాలన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర రెయిన్ వాటర్ సంపులను నిర్మించాలని ఆదేశించారు.

అలర్ట్‌గా ఉండాలని పొన్నం ఆదేశాలు

సో ఇప్పుడు వీటికి తగ్గట్లే ఏర్పాట్లు జరిగాయి. రివ్యూలు జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అన్నివేళలా అలర్ట్ గా ఉండాలని, ఇటీవల తీసుకున్న రివ్యూ మీటింగ్ లో జిహెచ్ఎంసి, వాటర్ బోర్డు, హైడ్రా, పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శాఖలన్నీ కలిసి మే నెల చివరి వారంలో లేదా, జూన్ మొదటి వారం లోగా మాక్ డ్రిల్ ఏర్పాటు చేయాలని, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలా అప్రమత్తంగా ఉండాలో అవగాహన పెంచాలన్నారు. ఇప్పటికే వరద పోయేందుకు చేపట్టిన పనులు 56 శాతం పూర్తయ్యాయని, మిగిలిన అన్ని పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు GHMC కమిషనర్ కర్ణన్.

అన్ని శాఖల సమన్వయంతో అలర్ట్‌గా 

ఇక ప్రత్యేకంగా ఏర్పాటైన హైడ్రా విభాగం కూడా వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తిస్థాయిలో సిద్ధమైందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటున్నారు. ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర అలర్ట్‌గా ఉండాలని, పూర్తిస్థాయి ఎక్విప్ మెంట్‌తో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎక్కడ నీళ్లు నిలిచినా, చెట్లు విరిగినా, ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్న వాటిని వెంటనే క్లియర్ చేసేందుకు టీములను రెడీ చేశారు. నిజానికి హైదరాబాద్ లో రెండు సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడితే తట్టుకునేలా డ్రైనేజ్ సిస్టమ్ లేదు. అందుకే అన్ని శాఖల సమన్వయంతో అలర్ట్‌గా ఉన్నామంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.

జిహెచ్ఎంసి పరిధిలో 141 వాటర్ లాగిన్ లొకేషన్స్

జిహెచ్ఎంసి పరిధిలో 141 వాటర్ లాగిన్ లొకేషన్స్ గుర్తించగా, అందులో 22 – 25 లొకేషన్స్ లో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించారు. మిగతా లొకేషన్లలో కూడా వరద నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. జూన్ ఫస్ట్ వీక్ లోగా నాలాలన్నీ క్లీన్ చేయాలన్న ఆదేశాలు వెళ్లాయి. సిటీలో 1304 కిలోమీటర్ల పొడవు నాలాలు ఉన్నాయి. వీటిలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నాలా ఆడిట్ సకాలంలో పూర్తి చేయాలని కూడా సూచనలు వెళ్లాయి.

మాన్ సూన్ ప్రిపేర్డ్ కార్యక్రమాలను జనం దగ్గరికి తీసుకెళ్లేందుకు చర్యలు

గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ లో చార్మినార్, కూకట్ పల్లి సికింద్రాబాద్ జోన్ లో ఎక్కువ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పటికే గ్రేటర్ లో 12 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ ను జిహెచ్ఎంసి నిర్మించింది. అక్కడ కొంతమేర మంచి రిజల్ట్స్ ఇస్తున్నప్పటికీ, వాటిపైన ఎప్పటికప్పుడు అధికారుల మెయింటెనెన్స్ చేయకపోతే, చెత్త ఆగి వాటర్ నిలిచే ఇబ్బందులు వస్తాయి. అలాగే గ్రేటర్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి. అక్కడ తీసుకున్న జాగ్రత్తలపై డీటెయిల్ రిపోర్ట్‌ను జోనల్ కమిషనర్‌లను కర్ణన్ అడిగి తెలుసుకున్నారు. మాన్ సూన్ ప్రిపేర్డ్ కార్యక్రమాలను జనం దగ్గరికి తీసుకెళ్లాలని కూడా ఆదేశించారు. అటు ఖైరతాబాద్, శేరి లింగంపల్లి జోన్లో డీసిల్టింగ్ పనులు స్లోగా జరుగుతున్నాయని GHMC కమిషనర్ సీరియస్ కూడా అయ్యారు. అలాగే పురాతన భవనాలపైన ప్రత్యేక ఫోకస్ పెట్టి లెక్కలు తేల్చే పనిలో ఉన్నారు. మరీ అద్వానంగా బిల్డింగ్ ఉంటే నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించడం, కూల్చేయడంపై ఫోకస్ పెట్టాలని టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు కర్ణన్.

వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు

వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసేలా అలర్ట్ తో ఉన్నారు. డ్రైనేజీలు పొంగకూడా ఎప్పటికప్పుడు సిల్ట్ తీస్తూ, వాటిని క్లీన్ చేయాలన్నారు. అయితే తక్కువ సమయంలో ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×