BigTV English

Spirit Movie : సందీప్ కండిషన్స్ కి బెంబేలెత్తిపోయిన హీరోయిన్… దెబ్బకి అవుట్..?

Spirit Movie : సందీప్ కండిషన్స్ కి బెంబేలెత్తిపోయిన హీరోయిన్… దెబ్బకి అవుట్..?

Spirit Movie : టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాహుబలి తర్వాత డార్లింగ్ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ప్రభాస్ చివరగా కల్కి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో పాటుగా 1200 కోట్ల వరకు కలెక్షన్స్ ను వసూల్ చేసింది. ప్రస్తుతం మరో నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అందులో స్పిరిట్ మూవీ కూడా ఒకటి. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో మొదలు కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీలో హీరోయిన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే..


హీరోయిన్ కు సందీప్ వంగా కండీషన్స్..

గతంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనే, ప్రభాస్ కాంబీనేషన్లో గత ఏడాది కల్కి మూవీ వచ్చింది. ఆ మూవీ హిట్ అవడంతో ఈ జోడి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ మూవీలో హీరోయిన్ గా దీపిక పదుకొనేను సంప్రదించినట్లు తెలుస్తుంది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందనున్న స్పిరిట్ మూవీ లో హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అంత ఓకే అయ్యాక కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి దీపిక ను తీసేసినట్లు తెలుస్తోంది. అందుకు కారణం వంగా పెట్టిన కొన్ని కండీషన్స్ పెట్టినట్లు తెలుస్తుంది..


Also Read : మరో ట్రిప్ కు రామ్ చరణ్.. ‘పెద్ది’ని ఇప్పట్లో చూడలేమా..?

హీరోయిన్ కు పెట్టిన కండీషన్స్.. 

సినిమా లాభాల్లో వాటా, తెలుగులో డైలాగులు చెప్పడం, పని గంటల పై పరిమితం పెట్టడం వంటి కండీషన్స్ నచ్చకే దీపికను డైరెక్టర్ తప్పించినట్లు టాక్..

ప్రస్తుతం సందీప్ రెడ్డి ఈ మూవీ లో దీపికా స్థానంలో మరో హీరోయిన్ వెతికే పనిలో బిజీ అయినట్లు తెలుస్తోంది.. ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. అంతేకాదు.. భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ప్రభాస్ కి జోడిగా స్పిరిట్ మూవీలో ఏ బ్యూటీ హీరోయిన్గా నటిస్తోంది అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ప్రభాస్ లాంటి భారీ క్రేజ్ ఉన్న హీరో నటించనున్న మూవీ కావడం , వరుస విజయాలతో అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న దర్శకులలో ఒకరు అయినటువంటి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కావడంతో స్పిరిట్ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.. యానిమల్ ని మించి ఏ సినిమా కూడా హిట్ అవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే హీరోయిన్ గురించి తెలిసే అవకాశం ఉందని సమాచారం..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×