Kollywood: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న సూరి (Soori) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన కామెడీతో, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ఇప్పుడు హీరోగా కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి (VijaySethupathi) ‘విడుదలై’ సినిమాతో సూరికి హీరోగా కూడా గుర్తింపు లభించింది. ఇక చివరిగా ఈయన నటించిన చిత్రం ‘మామన్’. ఈ సినిమాతో ఒక ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు. ఇకపోతే సూరి హీరోగానే కాకుండా ఇప్పుడు హోటల్ బిజినెస్ లో కూడా పెట్టుబడులు పెట్టారు. అందులో భాగంగానే ఆయనకి మధురైలో ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ ని ఆయన తమ్ముడు లక్ష్మణన్ చూసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఇదే విషయంపై సూరి తమ్ముడు లక్ష్మణన్ పై కలెక్టర్ కి కంప్లైంట్ వెళ్ళింది. దీంతో ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. మరి అసలు విషయం ఏమైందో ఇప్పుడు చూద్దాం.
నటుడు సూరి తమ్ముడిపై దొంగతనం కేస్..
మధురైలో ఏర్పాటుచేసిన సూరీ హోటల్ ను ప్రస్తుతం ఆయన తమ్ముడు లక్ష్మణన్ చూసుకుంటూ ఉండగా.. అదే ప్రాంతంలో ముత్తుస్వామి (55) అనే వ్యక్తి ‘అలైగళ్ ‘ పేరుతో ఒక ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నారు. ఈయనకి సూరీ తమ్ముడు లక్ష్మణన్ కి మధ్య పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. రోడ్డు మీద పార్కింగ్ వల్ల ఇబ్బంది అవుతోందని ముత్తుస్వామి, లక్ష్మణ్ ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతూనే ఉండేవి. ఈ నేపథ్యంలోనే లక్ష్మణన్ పై ముత్తుస్వామి ఏకంగా కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. కలెక్టర్ కి రాసిన లేఖలో ముత్తుస్వామి.. “నా దుకాణం కింద నటుడు సూరి తమ్ముడు లక్ష్మణన్.. నా ఆఫీస్ ముందు నడకదారిని ఆక్రమించాడు. అది తాను అద్దెకు తీసుకున్నానని చెప్పి ఖాళీ చేయడం లేదు. దీని గురించి తళ్లకుళం పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఇంటి ఓనర్ తో ఎక్కువ డబ్బు ఇస్తాను. పై అంతస్థు వాళ్లని ఖాళీ చేయించి, నాకు ఇవ్వమని గొడవ చేస్తున్నాడు. నా అనుమతి లేకుండా నా ఆఫీసు తాళం పగలగొట్టి కాగితాలతో పాటు డబ్బు కూడా దొంగలించాడు. పైకి వెళ్లడానికి దారి లేకుండా మూసివేశాడు. కాబట్టి అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని” ముత్తుస్వామి కలెక్టర్ కి ఇచ్చిన ఫిర్యాదులో తన బాధను వెల్లడించారు.
సూరి తమ్ముడుపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కలెక్టర్ కి కంప్లైంట్..
అలాగే మీడియాతో మాట్లాడుతూ..” ఈ విషయం నటుడు సూరికి తెలుసో లేదో నాకు తెలియదు. కానీ ఆయన పేరుని మాత్రం వీళ్లు వాడుకుంటున్నారు అనిపిస్తోంది. వాళ్ళ వ్యాపారం గురించి నేను ఫిర్యాదు చేయలేదు. ఇలాంటివి చేస్తున్న ఆయన తమ్ముడి పైన చర్యలు తీసుకోవాలని నేను కలెక్టర్ ను కోరాను అంటూ ముత్తుస్వామి మీడియాతో తెలిపారు . ఇక నటుడు సూరి తమ్ముడు లక్ష్మణన్ పై దొంగతనం కేసు ఫైల్ అవ్వడంతో ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.మరి ఈ విషయం సూరికి తెలుసో లేదో తెలియదు కానీ ఒకవేళ తెలిస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఇటు అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై సూరి తన అభిప్రాయాన్ని ఏ విధంగా వెల్లడిస్తారో చూడాలి.
also read:Vishwambhara: కేన్స్ చిత్రోత్సవంలో చిరంజీవి ‘ విశ్వంభర’.. రెడ్ కార్పెట్ పై నిర్మాత సందడి..!