E-Paper
Advertisement

రోడ్లపై ఉన్న బండి దగ్గర ఫుడ్ తింటున్నారా.. జీహెచ్ఎంసీ కొత్త రూల్స్..!

రోడ్లపై ఉన్న బండి దగ్గర ఫుడ్ తింటున్నారా.. జీహెచ్ఎంసీ కొత్త రూల్స్..!
Advertisement

Food Safety: స్వేచ్ఛ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఖచ్చితంగా నాణ్యత పాటించాల్సిందేనని, తప్పకుండా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకోవాల్సిందేనని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెండర్స్ కు అధికారులు సూచించారు. నగరంలో స్ట్రీట్ ఫుడ్ కల్చర్ రోజు రోజుకూ పెరుగుతున్న తరుణంలో వెండర్స్ నాణ్యమైన ఆహారాన్ని అందించేలా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కు ఫుడ్ సేఫ్టీ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెండర్స్ కు పరిశుభ్రత, ఆహార భద్రతపై కీలక సూచనలు చేశారు.

ఇది తప్పని సరి..

ఫుడ్ సేఫ్టీ వింగ్, నెస్లే ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో నగరంలోని రెండు వందల మంది ఫుడ్ వెండర్స్ పాల్గొన్నారు. ప్రజలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిశుభ్రత ఎంతో ముఖ్యమని అధికారులు వివరించారు. ఫుడ్ తయారీ నుంచి సర్వింగ్ వరకు ప్రతి దశలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఫుడ్ హ్యాండ్లింగ్ సమయంలో హ్యాండ్ గ్లోవ్స్, హెడ్ క్యాప్స్, ఏప్రాన్ లు తప్పనిసరిగా వినియోగించాలని అధికారులు సూచించారు. ఆహారం తయారుచేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉండటంతో పాటు వంట సామగ్రి కూడా శుభ్రంగా, నాణ్యత కలిగి ఉండాలని సూచించారు. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడరాదని, కస్టమర్లకు సేఫ్ ఫుడ్ అందించడమే ప్రధాన బాధ్యతగా భావించాలని వెండర్స్ కు అవగాహన కల్పించారు.

Advertisement

Also read: కేరళం చుట్టూ కొత్త రాజకీయాలు.. కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం, ఏం జరుగుతోంది?

నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ..

ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మూర్తి రాజు మాట్లాడుతూ ఫుడ్ కల్తీ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ట్రైనింగ్ లో వివరించినట్లు తెలిపారు. కుళ్ళిపోయిన కూరగాయలు, నాణ్యతలేని పదార్థాలు, ఎక్స్పైర్ అయిన ఐటమ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దని హెచ్చరించినట్లు ఆయన వివరించారు. నిల్వ చేసే పదార్థాలను సరైన ఉష్ణోగ్రతలో ఉంచాలని, తాగునీరు, ఐస్, ఆయిల్ వంటి వాటి నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించినట్లు మూర్తి రాజు తెలిపారు. ట్రైనింగ్ పూర్తి చేసిన స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కు అధికారులు సేఫ్టీ కిట్స్ తో పాటు సర్టిఫికెట్లు అందజేసినట్లు వివరించారు. భవిష్యత్తులో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించినట్లు, ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడంలో ప్రతి ఫుడ్ వెండర్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Also read: రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్.. 14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు..!

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×