హైదరాబాద్ లో బోనాల పండగ మొదలైంది. నేడు తొలిపూజతో బోనాల సందడి స్టార్ట్ అయింది. ఈనెల 29న రెండో పూజ, జులై 3న మూడో పూజ, ఆరో తేదీన నాలుగో పూజ.. ఇలా జులై 24 వరకు అమ్మవారికి పూజలు ఉంటాయి. 24వతేదీన తొమ్మిదో పూజతో బోనాలు ముగుస్తాయి. ఈ పూజలు జరిగే రోజుల్లో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ట్రాఫిక్ విషయంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని, రద్దీ మార్గాలను అవాయిడ్ చేయాలని సూచిస్తున్నారు పోలీసులు.
🚦Traffic Advisory Alert 🚧
Commuters, please take note!
In view of Sri Jagadamba Mahankali Golconda Bonalu Celebrations – 2025, traffic diversions and restrictions will be in place.Plan your travel accordingly for a smooth commute.#TrafficAdvisory #TrafficAlert… pic.twitter.com/dhNLluvqJp
— Hyderabad Traffic Police (@HYDTP) June 25, 2025
శ్రీ జగదాంబ మహంకాళి గోల్కొండ బోనాల ఉత్సవాల సందర్భంగా ఈనెల 26నుంచి జులై 24 వరకు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయని తెలిపారు అధికారులు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలను వాహనదారులు పాటించాలని చెప్పారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, గోల్కొండ కోటకు దారితీసే రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఉంటుందని, అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను వాహనదారులు ఎంచుకోవాల్సి ఉంటుందని సూచించారు.
రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలు
– రామదేవ్‌గూడ నుంచి మక్కై దర్వాజా మీదుగా గోల్కొండ కోట వరకు
– లంగర్ హౌజ్ నుండి ఫతే దర్వాజా మీదుగా గోల్కొండ కోట
– షేక్‌పేట నాలా, ఏడు సమాధులు బంజారా దర్వాజా మీదుగా గోల్కొండ కోట
పార్కింగ్ సౌకర్యాలు
రామ్‌దేవ్‌గూడ (మక్కై దర్వాజా) నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలకు అషూర్ ఖానా నుండి ఆర్మీ సెంట్రీ పోస్ట్ వరకు పార్కింగ్ ఏరియాని కేటాయించారు పోలీసులు.
కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలకు ఆర్టిలరీ సెంటర్, రామ్‌దేవ్‌గూడ, అషూర్ ఖానా, గోల్కొండ ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు.
సెట్విన్ బస్సుల్ని మాత్రం అషూర్ ఖానా వరకే అనుమతిస్తారు.
లంగర్ హౌజ్ (ఫతే దర్వాజా) నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలకు MCH పార్క్, గోల్కొండ బస్ స్టాప్, అల్ హిరా స్కూల్ వద్ద పార్కింగ్ ఉంటుంది.
కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలకు గోల్కొండ ఏరియా హాస్పిటల్ లో పార్కింగ్ ఫెసిలిటీ కల్పించారు.
ఇక షేక్‌పేట్ (బంజారా దర్వాజా) వైపు నుంచి వచ్చే వాహనాల విషయంలో.. కార్లు, ఇతర ఫోర్ వీలర్లకు హాకీ గ్రౌండ్, ఒవైసీ గ్రౌండ్, దక్కన్ పార్క్ (7 సమాధులు) పార్కింగ్ ప్లేస్ గాకేటాయించారు. బైక్ లను గోల్ఫ్ క్లబ్ రోడ్ బై-లేన్ ప్రాంతంలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
భక్తులకు కేటాయించిన ప్రాంతాల్లో మాత్రమే వాహనాలను పార్కింగ్ చేసి, అక్కడ్నుంచి కాలి నడకన మాత్రమే గోల్కొండ కోటకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు పోలీసులు. పార్కింగ్ జోన్ల వద్ద శాంతిభద్రతలను కాపాడటానికి, అధికారులకు సహకరించాలని పౌరులకు సూచించారు.
హెల్ప్‌లైన్
ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నెంబర్ 9010203626 లో సంప్రదించాలని సూచించారు. రియల్ టైమ్ అప్‌డేట్స్, సూచనలకోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Facebook: facebook.com/HYDTP
Twitter: @HYDTP లో పోలీసులు అందుబాటులో ఉంటారు.