Ravi – Jaiswal : సాధారణంగా సినిమా సెలబ్రెటీలకు, క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు అభిమానులు ఉండటం మనం నిత్యం చూస్తుంటాం. తమ అభిమాని ఏదైనా చేశాడంటే మనం చాలా గొప్పగా చెబుతుంటాం. ముఖ్యంగా తమ సినిమా హీరో హిట్ అయితే ఆ హీరో గురించి చెబుతుంటాం. తమకు నచ్చిన క్రీడాకారుడు అద్భుతంగా ఆడాడంటే అతని గురించి చాలా గొప్పగా చెబుతుంటాం. ఇలాంటి సంఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఒక అంధ క్రికెట్ అభిమాని మాత్రం తనకు టీమిండియా క్రికెటర్ అంటే చాలా ఇష్టమని ఓ మీడియా ప్రతినిధితో చెప్పడం గమనార్హం.
Also Read : ICC New Rules : టెస్ట్ క్రికెట్ లో కొత్త రూల్స్.. ఇక బౌలర్లకు చుక్కలే.. పూర్తి వివరాలు ఇవే
యశస్వికి అంధ క్రికెట్ అభిమాని..
యూకేలోని హెడ్డింగ్లీ స్టేడియంలో ఓ మీడియా ప్రతినిధి 12 ఏళ్ల రవి చాహల్ అనే అంధ క్రికెట్ అభిమానిని ఇంటర్వ్యూ చేశాడు. అతని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. అతనికి క్రికెట్ పట్ల ఉన్న ప్రేమను తెలియజేశాడు. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ కి సంబంధించిన కామెంట్స్ తరచూ వినేవాడు రవి. తాను క్రికెట్ గురించి గొప్పగా వర్ణించాడు. అంధుడివి కదా అతన్ని చూడకుండా ఎలా అభిమానివి అని చెబుతున్నావంటే.. చూడకున్నా కానీ అతని ఆట గురించి కామెంట్స్ రూపంలో వింటున్నాను. అలాగే బెల్ ఉన్న బంతి ఉంది కాబట్టి వినగలను అని చెప్పుకొచ్చాడు. అయితే తనకు టీమిండియా క్రికెటర్ యశస్వి జైస్వాల్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని గుర్తు చేశాడు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టుతో భారత్ 5 టెస్ట్ సిరీస్ మ్యాచ్ లు ఆడుతున్న విషయం తెలిసిందే.
బర్మింగ్ హమ్ లో బుమ్రా డౌటే..!
ఆ ఐదు టెస్ట్ సిరీస్ మ్యాచ్ ల్లో తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే రెండో టెస్ట్ లో టీమిండియా కొన్ని మార్పులు, చేర్పులతో బరిలోకి దిగనున్నట్టు సమాచారం. ముఖ్యంగా జులై 2 నుంచి బర్మింగ్ హమ్ లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ లో భాగంగా ఈ మ్యాచ్ కి భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నట్టు సమాచారం. జులై 10 నుంచి లార్డ్స్ లో జరిగే మూడో టెస్టులో మాత్రం బుమ్రా ఆడనున్నట్టు సమాచారం. ఈ 5 టెస్ట్ సిరీస్ మ్యాచ్ ల్లో బుమ్రా కేవలం మూడు మ్యాచ్ లే ఆడుతాడని జట్టును ఎంపిక ేసిన సందర్భంలోనే సెలక్షన్ కమిటీ ప్రకటించింది. రెండో టెస్ట్లో బుమ్రా ఆడకపోతే టీమిండియా కి గట్టి దెబ్బే అవుతుందని అభిమానులు పేర్కొంటున్నారు. ఇప్పటికే తొలి టెస్ట్ లో ఓటమి పాలైన టీమిండియా సిరీస్ లో వెనుకబడిపోయింది. రెండో టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా లేకుండా బరిలోకి దిగితే.. టీమిండియా బౌలింగ్ పై తీవ్ర ప్రభావం పడనుంది. తొలి టెస్ట్ లో బుమ్రా తొలి ఇన్నింగ్స్ 5 వికెట్లు తీయడం గమనార్హం. రెండో టెస్ట్ లో టీమిండియా ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో వేచి చూడాలి మరీ.
?igsh=MWFjZnl6OTh3ajBldQ==