E-Paper
Advertisement

తెలంగాణ పట్టణాభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 5 భారీ ప్రాజెక్టులకు ఆమోదం!

తెలంగాణ పట్టణాభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 5 భారీ ప్రాజెక్టులకు ఆమోదం!
Advertisement

Urban Projects: తెలంగాణలో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  3వేల 892 కోట్ల అంచనా వ్యయంతో  ఐదు ప్రాజెక్టులకు  ఆమోదం తెలిపింది. కేంద్ర పట్టణాభివృద్ధి  ఆధ్వర్యంలో  ఇటీవల ఢిల్లీలో  నిర్వహించిన నేషనల్‌ అపెక్స్‌ కమిటీ  అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద  తెలంగాణలో  ఐదు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వాటి  అంచనా వ్యయం 3 వేల 892 కోట్లు . అందులో 25 శాతం ..అంటే  873 కోట్ల నిధులను  కేంద్రం ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా  దాదాపు ఇంతే మొత్తంలో  ఫండింగ్‌ చేయనుంది.. ఇక మిగతా వ్యయాన్ని  పబ్లిక్‌  ప్రైవేట్‌ పార్టనర్‌ షిఫ్‌లో  పనులు దక్కించుకన్న సంస్థలు సమకూరుస్తాయి.

టూరిజం అభివృద్ధికి 57 కోట్లు..

హైదరాబాద్‌కు గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్టు రెండో, మూడో దశల కోసం నీటి నిల్వ సదుపాయాలు, 120 కిలోమీటర్ల పైప్‌లైన్లు, రెండు వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి 1,992 కోట్ల వ్యయం ప్రతిపాదించారు. ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా గ్రేటర్‌ వరంగల్‌  స్మార్ట్‌ వాటర్‌  వ్యవస్థ కోసం 1,465 కోట్లు, ఫోర్ట్‌  వరంగల్ కందకం పునరుద్ధరణకు 209 కోట్లు ,హనుమకొండ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి కోసం 168 కోట్లు ,అలాగే అలంపూర్ టెంపుల్‌ హెరిటేజ్‌ అండ్‌ టూరిజం అభివృద్ధికి 57 కోట్లు.. మొత్తం గా 3వేల 982 కోట్ల అంచనా వ్యయానికి కేంద్రం ఆమోదం తెలిపింది.

అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌..

UCF స్కీమ్‌లో భాగంగా నేషనల్‌ అపెక్స్‌ కమిటీ  గత మేలో  వరంగల్‌ అండర్‌ డ్రైనేజీ నిర్మాణానికి 4వేల 674 కోట్లు, కరీంనగర్‌  అర్బన్‌ ట్రాన్స్‌ఫార్మషేన్‌ కోసం 840 కోట్లు. ఖమ్మంలో ఏఐ కమాండ్‌ కంట్రోల్‌  సెంటర్‌ నిర్మాణానికి 160 కోట్లు మంజూరు చేసింది. వాటి నిర్మాణ ప్రతిపాదనలు సిద్దమవుతున్నాయి. గతంలో మూడు, ఇప్పుడు ఐదు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వరంగల్‌కు మరోసారి   అధిక ప్రాధాన్యం దక్కడం విశేషం. మొత్తంగా  అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ కింద కేంద్రం నుంచి తెలంగాణకు ఇప్పటి వరకు మంజూరైన  ప్రాజెక్టుల  విలువ 9వేల 5 వందల కోట్లకు చేరుకుంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్ నీటి సరఫరా సామర్థ్యం పెరగడంతో పాటు వరంగల్‌లో వరద ముంపు సమస్యను తగ్గించేందుకు అవకాశం ఉంటుంది.
Tags

Related News

‘బీజేపీ నేతలవి ఉత్త మాటలే’.. మోదీ, అమిత్ షాలకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్!

DSP భీంరెడ్డి అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్.. ఇళ్లు, కార్లు, భూములు అటాచ్ చేసిన ఐటీ!

ధర్మపురి లో పుష్కరాల నిధుల రచ్చ.. ఇది అభివృద్ధా.. లేక మెరుగులా..?

కేటీఆర్ బ్లాక్‌మెయిలర్ రావుగా మారారు.. బల్మూరి వెంకట్ ఫైర్!

హైదరాబాద్‌లో భారీ గంజాయి రవాణా ముఠా గుట్టు రట్టు!

పేట్‌బషీరాబాద్‌లో రేషన్ గోధుమల దందా.. పంజాబ్ నుంచి వచ్చి టాప్ బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్!

మీ ఇంటికి కొత్త విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్?

Big Stories

Advertisement
×