BigTV English

CM Revanthreddy: సీఎం రేవంత్‌తో గవర్నర్ భేటీ.. రాజకీయాలపై చర్చ.. కార్యక్రమానికి రావాలని పిలుపు

CM Revanthreddy: సీఎం రేవంత్‌తో గవర్నర్ భేటీ.. రాజకీయాలపై చర్చ.. కార్యక్రమానికి రావాలని పిలుపు

CM Revanthreddy with Bandaru Dattatreya(TS news updates): తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కలిశారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను కలిశారు. అక్టోబర్‌లో జరగనున్న ‘అలయ్-బలయ్’ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వాన పత్రికను అందించారు గవర్నర్ దత్తాత్రేయ.


అలయ్-బలయ్ కార్యక్రమం పేరు చెప్పగానే దీనికి బండారు దత్తాత్రేయ గుర్తుకు వస్తారు. ఈ కార్యక్రమానికి ఐకాన్ కూడా. తెలంగాణ సంస్కృతి- సంప్రదాయాలను చాటి చెప్పాలనే ఉద్దేశంతో 17 ఏళ్ల కిందట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారాయన. ఎప్పుడు, ఎక్కడ.. ఏ పదవిలో ఉన్నా ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ప్రతీ ఏడాది ఆయన నిర్వహిస్తుంటారు.

ప్రస్తుతం హర్యానా గవర్నర్‌‌గా ఉన్న బండారు దత్తాత్రేయ, అలయ్-బలయ్ ఈవెంట్‌కు రావాలని ప్రముఖులను ఇన్వైట్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న గవర్నర్, ప్రముఖుల వద్దకు వెళ్లి ఆహ్వానిస్తున్నారు. ప్రతీ ఏటా దసరా మరసటి రోజున ఈ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.


ALSO READ: కవితకు బెయిల్‌ వచ్చేనా.. సుప్రీంకోర్టులో విచారణ.. టెన్షన్‌లో బీఆర్ఎస్ నేతలు

ఇందులోభాగంగా మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు గవర్నర్ బండారు దత్తాత్రేయ. తొలుత సీఎంను శాలువాతో సత్కరించారు గవర్నర్. అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ‘అలయ్-బలయ్’ కార్యక్రమానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు. అందుకు సరేనని ముఖ్యమంత్రి చెప్పారు.

నార్మల్‌గా ఇద్దరు కీలక రాజకీయ నేతలు కలిస్తే.. రాజకీయాల గురించి మాట్లాడు కోవడం సహజం. సీఎం రేవంత్‌రెడ్డి-గవర్నర్ బండారు దత్తాత్రేయ మధ్య రాజకీయాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలపై చర్చించుకున్నారు. ఏయే అంశాలపై మాట్లాడుకున్నారనేది అది తర్వాత విషయం.

మొత్తానికి ఇద్దరు కీలక నేతలు కలవడంతో ఏం మాట్లాడుకున్నారనే దానిపై తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చ సాగుతోంది.

 

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×