Dharma Mahesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా కొనసాగిన ధర్మ మహేష్ (Dharma Mahesh)ఇటీవల కాలంలో తన వ్యక్తిగత విషయాలు ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈయన గౌతమి(Gawthami) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ తనకు ఉన్న చెడు అలవాట్ల కారణంగా తనని చిత్రహింసలకు గురి చేస్తున్నారని తెలియజేశారు. తనకు బిడ్డ పుట్టిన తర్వాత తన అత్తగారి కుటుంబం కూడా తనని చిత్రహింసలకు గురిచేస్తుంది అంటూ గత కొంతకాలంగా గౌతమి పలు ఆరోపణలు చేస్తూ వచ్చారు.. ఇలా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఈమె ఇటీవల బిగ్ టీవీ ఇంటర్వ్యూలో కూడా పాల్గొని తన భర్త ధర్మ మహేష్ పై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు
ఇకపోతే తన భర్త ఎంతోమంది అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకున్నారని తెలిపారు. అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న రీతూ చౌదరి (Rithu Chowdary)తో తన భర్తకు అఫైర్ ఉందని ప్రతిరోజు ఆమె రాత్రి తన ఫ్లాట్ కి వచ్చి ఉదయమే వెళ్లిపోయేది అంటూ కొన్ని వీడియోలను కూడా బయట పెట్టడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. ఇలా రీతు చౌదరి ధర్మ రిలేషన్ గురించి గౌతమి చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా ధర్మా మహేష్ తండ్రి కాకాణి బాబు(Kakani Babu) బిగ్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన రీతు చౌదరి వ్యవహారంపై స్పందించారు.
ధర్మ రీతూతో వెళ్తే తప్పేంటి?
ఈ సందర్భంగా ధర్మ మహేష్ ఫాదర్ కాకాణి మాట్లాడుతూ.. తన కుమారుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అబ్బాయి సినిమా వ్యవహారాల కారణంగా ఎంతో మందితో కలిసి పని చేస్తూ ఉంటారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారి జీవితాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. వారికి సమయంతో పని ఉండదని తెలిపారు. తన కొడుకు రీతు చౌదరితో కలిసి లిఫ్ట్ నుంచి బయటకు వస్తే తప్పేముంది.. ఎంతోమంది అమ్మాయిలు, అబ్బాయిలు ఇలా లిఫ్ట్ నుంచి బయటకు వస్తారు… వారందరూ తప్పు చేసినట్టేనా? అంటూ తన కోడలు గౌతమి చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టడమే కాకుండా తన కొడుకుకు మద్దతు తెలిపారు.
గౌతమి బిడ్డతో సమానమే..
ఇక తన కోడలు గౌతమి కూడా రీల్స్ చేస్తూ ఎంతో మందిని కలుస్తూ ఉంటారు అయితే ఎప్పుడు మేము తప్పుగా ఆలోచించలేదని కానీ ఆ అమ్మాయికి తన కొడుకు విషయంలో ఎందుకు తప్పు అనిపించిందో అర్థం కాలేదు అంటూ కాకాణి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. అదేవిధంగా గౌతమి తనపై చేసిన ఆరోపణలపై కూడా ఈయన స్పందిస్తూ .. గౌతమి కూడా తనకు బిడ్డతో సమానం ఆమె మా కుటుంబం గురించి ఎన్ని మాటలు మాట్లాడినా తనని మేము ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలిపారు. ఇప్పటివరకు వారిద్దరు విడాకులు తీసుకోలేదు విడాకులు తీసుకునే వరకు గౌతమి మా ఇంటి కోడలే. ఆ అమ్మాయి ఆవేశంగా మాట్లాడిన ఒక కుటుంబ పెద్దగా తాను తిరిగి తనలాగే మాట్లాడలేదని తనపై చేసిన ఆరోపణల పట్ల కాకాణి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Akhanda 2 Release: అఖండ 2 రిలీజ్ డేట్ ప్రకటించిన బాలయ్య… టార్గెట్ మామూలుగా లేదుగా!