Dharma Mahesh: ధర్మ మహేష్(Dharma Mahesh) టాలీవుడ్ నటుడుగా గుర్తింపు పొందిన ఈయన సినిమాల కంటే కూడా ఇటీవల కాలంలో తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. గత కొంతకాలంగా మహేష్ భార్య గౌతమి(Gawthami) తన భర్త గురించి పలు ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా గౌతమి తన భర్తకు రీతూ చౌదరి(Rithu Chowdary)తో సంబంధం ఉందని తెలిపారు. అదేవిధంగా తన అత్తమామల గురించి కూడా ఈమె చేసిన వ్యాఖ్యల పట్ల తాజాగా ధర్మా మహేష్ తండ్రి కాకాణి బాబు(Kakani Babu) బిగ్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన విషయాలను బయటపెట్టారు. గౌతమి కోసం తన కుమారుడు ఆత్మహత్య యత్నం కూడా చేశారని ఈ సందర్భంగా బయటపెట్టారు.
తన కుమారుడు గుంటూరులో బీటెక్ చదివారని అయితే కాలేజీ చదువుతున్న సమయంలోనే గౌతమి తనకు పరిచయమైందని తెలిపారు. నిజానికి గౌతమి తన కుమారుడు కంటే సీనియర్ అని వెల్లడించారు. నా కొడుకు పెద్దగా చదువుకోడు తనకంటే కూడా వయసులో చిన్నవాడు అలాంటిది గౌతమి తన కొడుకుని ఎందుకు ప్రేమించిందో నాకు తెలియదు. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్న విషయం మా బంధువుల ద్వారా నాకు తెలిసిందని కాకాణి తెలిపారు. ఒకరోజు వీరిద్దరూ మా బంధువుల ఇంట్లో స్టే చేయడంతో ఈ విషయం వారు నాకు తెలియచేశారని వెల్లడించారు.
వారి మధ్య బంధం బలపడింది…
ఇలా వీరి ప్రేమ వ్యవహారం తెలియడంతో తాను మహేష్ ను మందలించాను చదువుకోవడానికి వెళ్లి ఇలా ప్రేమలు ఏంటి అంటూ మందలించాను కానీ వారు మాత్రం తమను ప్రేమను కొనసాగించారని తెలిపారు. ఇక చదువు పూర్తి అయిన తర్వాత మరోసారి ఇద్దరు పెళ్లి గురించి ప్రస్తావనకు రావడంతో తాను తన కుమార్తె పెళ్లి చేసిన తర్వాతే చేస్తానని చెప్పాను. ఇలా గ్యాప్ తీసుకోవడం వల్ల వారిద్దరి మధ్య దూరం పెరుగుతుందని భావించాను కానీ వారి బాండింగ్ మరింత స్ట్రాంగ్ అయిందని తెలిపారు. నా కూతురు పెళ్లి జరిగిన తర్వాత మరోసారి వీరు పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ఇద్దరికీ పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు మా అక్క కూతురితో పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను అంటూ నా నిర్ణయాన్ని తెలిపానని కాకాణి వెల్లడించారు.
నిద్రమాత్రలు మింగాడు…
ఇలా తన నిర్ణయాన్ని చెప్పడంతో మహేష్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేశారని గదిలో స్పృహ లేకుండా పడిపోవడంతో వెంటనే తనని ఏలూరు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించానని వెల్లడించారు.. ఇలా అమ్మాయినే తన జీవిత భాగస్వామిగా ఊహించుకున్నాను, తనని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోలేను అంటూ నా కొడుకు చెప్పడంతో తప్పనిసరి పరిస్థితులలో ఇష్టం లేకపోయినా వారిద్దరికీ పెళ్లి చేశాను. దాదాపు రెండు కోట్లు ఖర్చు చేసి ఎంతో ఘనంగా వీరి పెళ్లి చేశాము. పెళ్లి తర్వాత వాళ్లు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు మేము హనుమాన్ జంక్షన్ లో ఉన్నామని కాకాణి తెలిపారు. ఇలా ప్రేమించిన అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడని ధర్మా మహేష్ ఇప్పుడు తనని మోసం చేశాడని, తనకు అమ్మాయిల పిచ్చి ఉంది అంటూ గౌతమి ఆరోపణలు చేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.
Also Read: Darma Mahesh: ధర్మ మహేష్ గదిలో రీతూ చౌదరి…ధర్మ ఫాదర్ కాకాణి రియాక్షన్ ఇదే?