Hyderabad: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా పంగల్ మండలం చిక్కడపల్లికి చెందిన రంజిత్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. రంజీత్ మరదలు హారికాకు బెంగుళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. సోమవారం జాయినింగ్ డేట్ ఇవ్వడంతో.. రంజీత్‌తో కలిసి కారులో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరింది. రాజపూర్ శివారుకు చేరగానే ఓ కారు.. డివైడర్‌ను ఢీకొని రంజీత్ కారుపై పడింది. ఈ ప్రమాదంలో రంజిత్ , హారిక అక్కడికక్కడే మరణించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.