Khammam: ఖమ్మంలో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. ఏకంగా ఒకే రోజులో 6 ఇళ్లలో చోరీలకు పాల్పడటం.. స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఇంటి తాళాలను పగలకొట్టి విలువైన బంగారం, వెండి, నగదు మరికొన్ని ఇతర వస్తువులను ఎత్తుకొని పోతున్నారు. వైఎస్ఆర్ కాలనీలో అర్ధరాత్రి దొంగల ముఠా హల్ చల్ చేసింది. దొంగలంతా ఒకే సమయంలో పలు ఇళ్లను టార్గెట్ చేసుకున్నారు. తాళాలు పగలగొట్టి.. ఇళ్లలోకి చొరబడి విలువైన బంగారం, నగదును దొంగిలించారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ , ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.