BigTV English

Governor Kota MLCs: ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన కోదండరాం, అమీర్ అలీఖాన్

Governor Kota MLCs: ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన కోదండరాం, అమీర్ అలీఖాన్

Kodandaram and Aamir Ali Khan as Governor Kota MLCs (Telangana today news): తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లు శాసనమండలిలో అడుగుపెట్టారు. ఈ మేరకు ఇద్దరితో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సంద్భంగా వారికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ సి.మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు.


ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన తర్వా త కోదండరామ్ మాట్లాడారు. తాను ఎమ్మెల్సీగా నియామకం కావడంతో ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ పదవిని అదనపు బాధ్యతగా మాత్రమే భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నేను ఎప్పుడూ ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షల మేరకు పనిచేస్తానని ప్రకటించారు. ఈ పదవి చాలామంది బలిదానాలు చేయడంతో వచ్చిందని, వాళ్లను ఎప్పటికీ మరవమని పేర్కొన్నారు.

Also Read: ఆడపడుచులను అగౌరవపరిచే సంస్కృతి కాదు మాది: కేటీఆర్


కాంగ్రెస్ ప్రభుత్వం వీరిద్దరిని గతంలోనే నామినేట్ చేయగా.. ఈ విషయంపై బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లింది. నియామక గెజిట్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ విషయంపై ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీగా నియామించాలంటూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సిఫార్సులను అప్పటి గవర్నర్ రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×