BigTV English

Government Teachers : నోటీస్ బోర్డులో టీచర్ల ఫోటోలు.. ఎందుకంటే!

Government Teachers : నోటీస్ బోర్డులో టీచర్ల ఫోటోలు.. ఎందుకంటే!

Government Teachers : సర్కారు బడులకు డుమ్మాలు కొట్టే స్టూడెంట్స్ ఉండటం కామన్.. కానీ ఉపాధ్యాయులే డుమ్మా కొడితే..? తమ స్ధానంలో మరొకరిని నియామకం చేసి సొంత పనులకు వెళ్తుంటే? రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చాలా వెలుగు చూస్తున్నాయి. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ.. బినామీ ఉపాధ్యాయులకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త ఐడియా అమలు చేస్తోంది. ఇంతకీ విద్యాశాఖ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి.. ? ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలని భావిస్తున్నారు.?


రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై నోటీసు బోర్డుల్లో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయుల ఫోటోలను ప్రదర్శించాలని.. విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని సర్కారు బడుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల స్దానాల్లో ప్రైవేట్ వ్యక్తులు టీచర్లుగా పనిచేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులతో.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు డుమ్మా కొట్టే టీచర్లు, బినామీ టీచర్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్దులకు పాఠాలు చెప్పే టీచర్ల ఫోటోలను బోర్డుపై ప్రదర్శించాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో స్కూల్స్ లో ఉపాధ్యాయుల ఫోటోలు, వాటి కింద పేర్లు, ఏ సబ్జెక్టు బోధిస్తారు వంటి వివరాలను ఈ బోర్డుపై ప్రదర్శించాలని ఆదేశాలిచ్చారు. ఇప్పటికే చాలా బడుల్లో బోర్డుపై టీచర్ల ఫోటోలు, ఫోన్ నెంబర్లు ప్రదర్శిస్తున్నారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న టీచర్లకు అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు. సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.


ఉపాధ్యాయులందరూ తమ ఫోటోలు ప్రతీ పాఠశాలల్లో ప్రదర్శించాలని డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఐతే ఇప్పటి వరకు 20 శాతం స్కూళ్లలోనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఫోటోలను ప్రదర్శిస్తున్నారు. చాలా స్కూళ్లలో ఇంకా అమలు కావడం లేదు. పైగా జిల్లాలోని చాలా స్కూళ్లలో టీచర్లు.. బడులకు డుమ్మా కొడుతున్నారు. కొందరు తమ స్దానాల్లో తాత్కాలికంగా సిబ్బందిని నియామకం చేసుకుని.. సొంత పనులకు చక్కబెడుతున్నారు. కొందరు నెలల తరబడి బడులకు డుమ్మాకొడుతుంటే మరికొందరు కనబడి కనబడనట్లు వచ్చిపోతున్నారు.

ఇలాంటి డుమ్మా టీచర్లకు సర్కారు పెట్టిన కొత్త రూల్.. మార్పు తెస్తుందని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలోను పారదర్శకంగా బోధన సాగాలని, బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టారు. బయోమెట్రిక్ అటెండన్స్ మున్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. సిగ్నల్స్ లేవనే సాకుతో మ్యానువల్ గా ఉపాధ్యాయులు రిజిస్ట్రార్ లో సంతకాలు చేస్తున్నారు. ఈ విధానం కూడా తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా కొనసాగేలా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇటు టీచర్లు మాత్రం మంచి పరిణామంగా చెబుతున్నారు. కొందరి వల్ల అందరికి చెడ్డ పేరు వస్తుందని ఆ కొందరిలో మార్పు కోసం మంచి నిర్ణయం అంటున్నారు టీచర్లు.

ALSO READ : సీఎం అవుతావా కవితా? – గోనె ప్రకాశ్ రావు

సర్కారు బడులపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచేలా.. విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం కొందరిలో మోదం.. మరికొందరిలో ఖేదం మిగులుస్తుంది. విద్యాశాఖ నిర్ణయం మున్నాళ్ల ముచ్చట కాకుండా చూడాలని.. ఈ నిర్ణయంతోనైనా టీచర్లలో మార్పు వస్తే విద్యార్ధుల జీవితాలు మారుతాయని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×