Madhavi Latha: జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ నటి మాధవీలత మధ్య మాటల యుద్దం సాగుతున్న విషయం తెల్సిందే. ఆ యుద్దం మాధవీలతపై కేసు నమోదు వరకు దారితీసింది. ఈ విషయం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడ స్పందించారు. మాధవీలతకు మద్దతు పలికిన మంత్రి సత్యకుమార్, జేసీకి ఒకదశలో వార్నింగ్ ఇచ్చారు. అయితే ఉదయం నుండి జేసీ వర్సెస్ మాధవీలత గురించి మీడియా, సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే అదిగో అరెస్ట్, ఇదిగో అరెస్ట్ అంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇలా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఇంత జరుగుతుంటే మాధవీలత మాత్రం బాగా నిద్రపోయారట. అదికూడ నిద్ర లేచి చూసేసరికి ఫోన్ నిండా మిస్డ్ కాల్స్ ఉన్నాయట. తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వార మాధవీలత స్పందిస్తూ.. తనకు బాగా మైగ్రేన్ తలనొప్పి ఉందని, అందుకు బాగా నిద్రపోయానని ప్రకటించారు. అలాగే తన ఫోన్ కు ఎందరో మీడియా ప్రతినిధులు ఫోన్లు చేశారని, నిద్ర లేచి ఫోన్ చూసి ఖంగుతిన్నట్లు తెలిపారు. వాట్సప్ ఓపెన్ చేసినా కూడ, తన న్యూస్ లే తనకు కనిపిస్తున్నాయని ఇదెక్కడి రాద్దాంతమంటూ ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అంతేకాదు తనపై వచ్చే వార్తలు చూసి, తనకు నవ్వొస్తుందని కూడ మాధవీ అన్నారు. ఇలా మాధవీలత చేసిన పోస్ట్ కు ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ కి మాధవీలత రిప్లై రూపంలో సెటైర్ వేశారని చెప్పవచ్చు. ఒకసారి తాడిపత్రి కి వచ్చి చూడండి.. తాడిపత్రి అంటే ఏంటో.. జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే ఏంటో తెలుస్తుంది.. ఊరికే ఎవరో చెప్పిన దాన్ని పట్టుకుని.. నిందలు వేయడం కాదు అండి.. అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు.
Also Read: JC Prabhakar Reddy: జేసీ.. ఒక్కసారి ఏజ్ తెలుసుకో.. ఏపీ మంత్రి సెటైర్
ఆ కామెంట్ కి భయమేస్తుంది అంటూ మాధవీలత రిప్లై ఇచ్చారు. తాడిపత్రికి వచ్చేందుకు భయమేస్తుందని మాధవీలత ఇచ్చిన రిప్లైకి నెటిజన్స్ తెగ లైక్స్ చేస్తున్నారు. తాడిపత్రి అంటేనే జేసీ బ్రదర్స్ అడ్డాగా పేరు. ఇక్కడికి వచ్చి జేసీ బ్రదర్స్ చేసిన అభివృద్ది చూడండీ అంటూ నెటిజన్ కామెంట్ చేస్తే, మాధవీలత మాత్రం సెటైర్ వేసినట్లుగా రిప్లై ఇవ్వడం ఇప్పుడు మరోమారు వివాదానికి తెరతీసేలా ఉందని టాక్!