BigTV English

Greenko: గ్రీన్‌ కో.. క్విడ్ ప్రోకో! చూసింది గోరంతే.. తెలియాల్సింది కొండంత!

Greenko: గ్రీన్‌ కో.. క్విడ్ ప్రోకో! చూసింది గోరంతే.. తెలియాల్సింది కొండంత!

* కూకట్‌పల్లి భూముల్లో గ్రీన్ కో పాగా
* తెరు వెనుక చక్రం తిప్పిన కేటీఆర్!
* ఇష్టారీతిన దోచేసే బడా స్కెచ్


– గ్రీన్ కో ఏలుకో అనేలా వ్యవహరించిన కేటీఆర్
– హైటెక్ సిటీకి ఆనుకుని ఉన్న 240 ఎకరాలపై కన్ను
– కూకట్ పల్లిలో 1007 సర్వే నెంబర్‌ మాటున సెటిల్మెంట్స్
– టైటిల్ లేకుండానే ప్రైం ప్రాపర్టీస్‌తో జాయింట్ అగ్రిమెంట్
– అన్ని హక్కులు గ్రీన్ కో అనుబంధ సంస్థకే
– కేవలం సెటిల్మెంట్స్‌కే రూ.400 కోట్ల ఖర్చు
– క్విడ్ ప్రోకో కథ మొదలైంది ఇక్కడి నుంచే
– భాగ్యనగర్ సొసైటీ ఎదురు తిరడగంతో చేతులుమారిన డబ్బు
– ఇతర పార్టీలతోనూ కాంప్రమైజ్ కథలు
– అంతా తానై నడిపించిన పొనుగంటి శ్రీనివాసరావు
– 2024లో ఈవోడబ్ల్యూలో భూ వ్యవహారం కేసు
– ఫార్ములా రేస్‌లో రూ.600 కోట్లే.. భూ వ్యవహారంలో వేల కోట్ల బంధం

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809


స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: ఫార్ములా ఈ – రేస్ వ్యవహారంలో గ్రీన్ కో సంస్థకు బీఆర్ఎస్ పార్టీకి మధ్య క్విడ్ ప్రోకో(పరస్పర లబ్ధి) జరిగిందని తేలిపోయింది. కేటీఆర్ ఎంత బుకాయించినా లెక్కలతో సహా అంతా బయటకొచ్చింది. రేసుల పేరుతో తెరచాటున జరిగిన కాసుల కహానీలన్నీ ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. నిజానికి ఈ గ్రీన్ కోతో బీఆర్ఎస్ బంధం చిన్నదేం కాదు. కేసీఆర్ ఏలుబడిలో గ్రీన్ కో కంపెనీగా లబ్ధి చేకూరేలా చాలా వ్యవహారాలు నడిచాయి. ఇప్పుడు ఫార్ములా ఈ – రేస్‌లో బయటపడ్డ రూ.600 కోట్లు గోరంత అయితే, తెలియాల్సిన వేల కోట్ల దందాలు కొండంత ఉన్నాయి. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉండే ఏరియాలోని వివాదాస్పద భూమిపై కన్నేయడంతో కేసుల వరకు వెళ్లింది.

ప్రైం ఏరియాలో వివాదాస్పద భూమి

హైటెక్ సిటీ అంటే భూముల రేటు ఎలా ఉంటుందో తెలిసిందేగా. ఆ సరిహద్దులో భూమి అయినా హాట్ కేక్‌లాంటిదే. ధర మామూలుగా ఉండదు. అలాంటి ఏరియాకు ఆనుకుని 240 ఎకరాల భూమి చుట్టూ ఎన్నో ఏళ్లుగా వివాదం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీనికోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇదే క్రమంలో ప్రైం ప్రాపర్టీస్, గ్రీన్ కో కంపెనీకి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదిరింది. దీని వెనుక కేటీఆర్ చక్రం తిప్పినట్టు అనుమానాలున్నాయి. వివాదాస్పద భూముల్లో డెవెలప్‌మెంట్ అగ్రిమెంట్ అంటే, అప్పుడు మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్‌కు తెలియకుండా ఉంటుందా? అనేది పెద్ద ప్రశ్న.

అయితే, ఈ అగ్రిమెంట్‌ విషయంలో భాగ్యనగర్ సొసైటీ సభ్యులతో పాటు, భూమి తమదంటూ కొందరు మీడియా ముందుకురావడంతో కోర్టు కేసులు అయ్యాయి. కొందరైతే ఈ భూములను చూపించి దండిగా సొమ్ము చేసుకున్నారు. గజం రూ.3 లక్షలు పలికే భూమి కావడంతో అందరూ ఇన్వాల్వ్ అవుతూ సొమ్ము చేసుకున్నారు. ఈ వ్యవహారంలో గతంలో సొసైటీలో పనిచేసిన మాజీ సెక్రెటరీ పొన్నగంటి శ్రీనివాసరావుది కీ రోల్. గ్రీన్ కో కంపెనీ యజమాని అనిల్ కుమార్ పెట్టుబడులు పెట్టి కథంతా నడిపించాడు. 2018 జూన్ 28న ఈ భూములపై జాయింట్ డెవెలప్‌మమెంట్ అగ్రిమెంట్ కుదిరింది. డైరెక్టర్స్‌గా అనిల్ కుమార్, మహేష్ కొల్లి, విజయ్ కుమార్ అట్లూరి, వినయ్ కుమార్ పబ్బా, కృష్ణ నారాయణ్, శంకర్ కూన, అంకంరెడ్డి నాయుడు శ్రీనివాస్ ఉన్నారు.

ఈ భూములది పెద్ద చరిత్రే

కూకట్ పల్లిలోని సర్వే నెంబర్ 806, 1007, 1009, 1043 నుంచి 1065 వరకు మొత్తం 1500 ఎకరాలు ఉంటుంది. ఇది నిజాం రాజుకు సన్నిహితుడైన నవాబ్ రయిజ్ యార్ జంగ్ బహదూర్‌‌ది. ఇతను 1960లో చనిపోగా, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తైలు ఉండేవారు. 1963లో 1117 ఎకరాల భూమిని హౌజింగ్ బోర్డు రూ.7,64,000 నష్ట పరిహారం చెల్లించి సేకరించింది. సీలింగ్ యాక్ట్‌లో హెడ్ ఆఫ్ ఫ్యామిలీతో పాటు కుటుంబ సభ్యుల్లో ఫజలత్ హుస్సేన్ 69 ఎకరాలు, బషీర్ ఉన్నీసా బేగం 75 ఎకరాలు, ఫకర్ జహాబ్ బేగం 64 ఎకరాలు, షాజహాన్ బేగం 64, బిల్క్సూస్ బేగంకు 28 ఎకరాలు ఇచ్చినట్లు క్లెయిమ్ చేసుకున్నారు. నవాబ్ కుమారుడు మహ్మద్ అలీ సాహేబ్ అకస్మాత్తుగా చనిపోయాడు.

మనవడైన హసీం అలీకి అప్పటికి రెండు సంవత్సరాలు. అతనికి భూమి చెందాలని నవాబ్ రయిజ్ యార్ జంగ్ బహదూర్‌కి మహ్మద్ నుంచి సేల్ డీడ్ ద్వారా బదిలీ చేశారు. అదే సంవత్సరం 1952లో గిఫ్ట్ డీడ్ రూపంలో హసీం అలీకి బదిలీ అయింది. హాసీం అలీ మేజర్ అయిన తర్వాత 1972లో సహారా రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీకి అగ్రిమెంట్ చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అందుకు గాను 80 మందికి హిబ్బా(గిఫ్ట్) ఇస్తున్నట్లు వారంతా సహారా గ్రూప్‌లో డైరెక్టర్స్‌గా చేరినట్లు చూపించారు. 1973లో సిటీ సివిల్ కోర్టులో ఈ ఆస్తిని రాయించేలా ఒరిజినల్ సూట్ (ఓఎస్ నెంబర్ 122/1973) ఫైల్ చేశారు.

ఇందులో తన వారసత్వంగా రావాల్సిన భూ సేకరణ నష్టపరిహారం ఇవ్వలేదని, అంతా ఫజలత్ హుస్సేన్ కుటుంబం తీసుకుందనేది పిటిషనర్ వాదన. ఈ కేసుతో కుటుంబ సభ్యులంతా అంగీకారానికి వచ్చారు. సర్వే నెంబర్ 806లోని 43 ఎకరాలు, 1007లో 240 ఎకరాలు హాసీం అలీకి ఇస్తున్నట్లు ఒప్పుకున్నారు. వీటి విలువ మొత్తం ఆనాడు రూ.4 లక్షలుగా తెలిపారు. వీటన్నింటిని సహారాలో హిబ్బాతో తీసుకుని ఇచ్చారు. అయితే, ఒరిజినల్ హిబ్బాలు లేవు. సేల్ డీడ్స్ లేకపోవడంతో అసలు హసీం అలీ లేకుండానే తర్వాత ఈ భూములు దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజులకే సహారా ప్రైం ప్రాపర్టీస్‌గా అంతా మారింది. తర్వాత డైరెక్టర్స్‌గా ఉన్న 8 మంది విత్ డ్రా అయ్యారు.

ప్రైం ప్రాపర్టీస్ 1972లో డాక్యుమెంట్లు సృష్టించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సాధిక్ సయ్యద్ మొయినుద్దీన్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడు. 1972 నుంచి ఇప్పటి వరకు ప్రైం ప్రాపర్టీస్, హాసీం అలీ, హిబ్బా ఇచ్చిన వారి పేర్లపై రెవెన్యూ రికార్డ్స్‌లో నమోదు కాలేదు. 2004 తర్వాత తెరపైకి మాల్పాని, తేజో నారయణ్, దానం నాగేందర్, ఖాజీం అలీ, అవోపా సోసైటీ రవి ప్రసాద్, భాగ్యనగర్ సొసైటీ నుంచి పెద్దిరెడ్డి తన సోదరుడితో పాటు ఎంతోమంది ఇన్వాల్వ్ అయ్యారు. చాలామంది ప్రముఖులకు అగ్రిమెంట్లు ఉన్నాయి. స్టాండింగ్ కౌన్సిల్ సంపత్ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడో దీనిపై రిపోర్టులు ఇచ్చారు. హైకోర్టు స్టేలు, సుప్రీంకోర్టు తీర్పులు, కింది కోర్టులో టైటిల్ డిసైడ్ చేసుకోవాలని ఎన్నో కేసులు ఉన్నాయి. ఇందులో సినీ నిర్మాత బుర్గులపల్లి శివరామకృష్ణ లాంటి వారి పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి.

2018లో ట్విస్టుల మీద ట్విస్టులు

50 ఏండ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఈ భూ వివాదంలోకి అనుకోకుండా ఏడేండ్ల క్రితం జరిగిన బెదిరింపుల కేసులో అప్పటి ఏసీపీ, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు భుజంగరావుపై, ప్రైం ప్రాపర్టీస్‌తో పాటు అగ్రిమెంట్ చేసుకున్న గ్రీన్ కో కంపెనీపై 2024లో కేసు(ఎఫ్ఐఆర్ నెంబర్ 45) నమోదు అయింది. ఏ1గా మొయినుద్దీన్, ప్రైం ప్రాపర్టీస్ ఏ2గా శ్రీనివాసరావు, ఏ3గా గ్రీన్ కో అనిల్ కుమార్, ఏ4గా భుజంగరావు ఉన్నారు. 2018లో కోర్టుకు అప్పటి ప్రభుత్వ అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తూ అఫిడవిట్స్ ఇచ్చారు. ప్రైం ప్రాపర్టీస్‌కు రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. దీనిపై మళ్లీ సుప్రీంకోర్టు నుంచి సివిల్ కోర్టుకు టైటిల్ వివాదం చేరుకుంది.

ఆ సందర్భంలో క్రిమినల్ కేసులు నమోదు కావడంతో 240 ఎకరాల వివాదంలోకి కేటీఆర్ ఎంటర్ అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రీన్ కో సంస్థకు లబ్ధి చేకూరేలా ప్రైం ప్రాపర్టీస్‌తో డెవెలప్‌మెంట్ అగ్రిమెంట్ చేసుకోవడం వెనుక ఆయన హస్తం ఉందని, క్విడ్ ప్రోకో కిందే ఇదంతా నడిచిందనే అనుమానాలు ఉన్నాయి. ఫార్ములా ఈ – రేస్ కేసులో గ్రీన్ కో‌తో క్విడ్ ప్రోకో జరిగిందని తేలిపోవడంతో, ఇప్పుడు గత పదేళ్లలో ఇంకా ఇలాంటివెన్ని జరిగాయన్న చర్చ జోరుగా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వాటిపైనా దృష్టి పెడితే క్విడ్ ప్రోకో కొండంతా కదులుతుందని అంతా అంటున్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×