BigTV English

Train Accident in Russia: రష్యాలో పట్టాలు తప్పిన రైలు.. 70 మందికి గాయాలు!

Train Accident in Russia: రష్యాలో పట్టాలు తప్పిన రైలు.. 70 మందికి గాయాలు!

70 People Injured Russia Train Accident: రష్యాలో ఓ పాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 70 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. అందులో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్ కోమి రీజియన్‌‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


రైలు పట్టాలు తప్పడంతో తొమ్మిది బోగీలు కోమి నదిలో పడిపోయాయి. అయితే ఘటన సమయంలో నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే పరిస్థితి దారుణంగా ఉండేదని రైల్వే అధికారులు చెబుతున్నమాట.

ఘటన సమయంలో రైలులో దాదాపు 250 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగాయి రెస్క్యూ టీమ్‌లు. గాయపడిన బాధితులను వెంటనే అంబులెన్స్‌ లో సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. చాలామందికి స్వల్పంగా గాయలయ్యాయి.


కోమి రీజియన్‌లో ఇటీవల వరదలు వచ్చాయి. దీని కారణంగా రైలు పట్టాలు దెబ్బతిని ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనకు కారణం అదే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మరో ట్రాక్ ఉన్నా రైలు ఇప్పట్లో పునరుద్ధరణ కష్టమేనని అంటున్నారు అధికారులు.

Also Read:  నేపాల్‌పై ప్రకృతి కన్నెర.. భారీ వరదలకు 20 మంది మృతి!

Tags

Related News

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

Big Stories

×