E-Paper
Advertisement

Harish Rao: సిద్దిపేటలో త‌న‌పై పోటీ చేయాలంటూ రేవంత్ రెడ్డికి హ‌రీష్ రావు సవాల్

Harish Rao: సిద్దిపేటలో త‌న‌పై పోటీ చేయాలంటూ రేవంత్ రెడ్డికి హ‌రీష్ రావు సవాల్
Advertisement

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని.. అందుకే నిరసనగా తాము చెవిలో పూలు పెట్టుకుని అసెంబ్లీకి వచ్చామని ఆయన ఎద్దేవా చేశారు. ఒకవేళ ప్రభుత్వం హామీలను నెరవేర్చి ఉంటే తామే స్వయంగా కాంగ్రెస్ పార్టీని అభినందించేవాళ్లమని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మరో వారం రోజుల పాటు పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వం అసెంబ్లీని నడుపుతున్న తీరు అస్సలు బాలేదని హరీష్ రావు విమర్శించారు. సభా నియమాలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని.. ముఖ్యమైన ప్రశ్నలు చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేటీఆర్ అడిగిన ఉద్యోగాల నోటిఫికేషన్ల ప్రశ్నకు ప్రభుత్వం చెబుతున్న సమాధానాలు పచ్చి అబద్ధాలని ఆయన కొట్టిపారేశారు. బీఆర్ఎస్ హయాంలో నియమితులైన 50,785 మందికి నియామక పత్రాలు ఇచ్చి.. ఆ ఉద్యోగాలన్నీ తామే ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటోందని మండిపడ్డారు. ఇది నిరుద్యోగులను దగా చేయడమేనని ధ్వజమెత్తారు.

Advertisement

సంక్షేమ బోర్డులు మరియు కార్పొరేషన్లకు కేటాయించిన నిధుల వ్యయంపై హరీష్ రావు గణంకాలతో సహా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు కేటాయించిన నిధుల్లో కేవలం 2 శాతం మాత్రమే ఖర్చు చేశారని.. మిగిలిన 98 శాతం నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. రజక ఫెడరేషన్ కు రూ. 386 కోట్లు కేటాయించి కేవలం ఒక కోటి మాత్రమే ఖర్చు చేశారని.. మున్నూరు కాపు, ఆర్యవైశ్య, కృష్ణ బలిజ కార్పొరేషన్లకు వందల కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని వివరించారు. ఈ గణాంకాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

అసెంబ్లీ నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు విమర్శించారు. చనిపోయిన ఉద్యోగులకు చెక్కులు ఇచ్చేందుకు ఏకంగా మూడు గంటల పాటు సభను వాయిదా వేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గత రెండు రోజుల నుంచి జీరో అవర్ కూడా తీసుకోవడం లేదని.. ప్రజా సమస్యల చర్చను ప్రభుత్వం కావాలనే పక్కన పెడుతోందని ఆరోపించారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను తాము స్వాగతిస్తున్నామని.. సీట్లు పెరగడం వల్ల బీఆర్ఎస్ పార్టీకే లాభమని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

తెలంగాణ రాజకీయ భవిష్యత్తుపై ధీమా వ్యక్తం చేస్తూ.. రేవంత్ రెడ్డి ఎన్ని విన్యాసాలు చేసినా మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని హరీష్ రావు జోస్యం చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. ఏ సమయంలో గోల్ కొట్టాలో తమ పార్టీకి బాగా తెలుసని.. సిద్దిపేటలో తనపై పోటీకి సిద్ధమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

Read Also: Bhatti Vikramarka: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందుకే పేపర్లు చింపేశారు.. ఇది వాళ్ల వైఖరి, భట్టి విక్రమార్క ఫైర్

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×