BigTV English

KTR: హరీశ్‌ దెబ్బకు రోడ్డు మీద పడ్డ కేటీఆర్!?

KTR: హరీశ్‌ దెబ్బకు రోడ్డు మీద పడ్డ కేటీఆర్!?

KTR: కేటీఆర్. వైట్ కాలర్ లీడర్. హరీశ్ రావు. పక్కా మాస్ లీడర్. బావాబామ్మర్దుల ఆధిపత్య పోరు ఈనాటిది కాదు. విదేశాల నుంచి వచ్చి పార్టీలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ ఉండనే ఉంది. కొడుకు కేటీఆర్‌ను ప్రమోట్ చేసేందుకు.. అల్లుడు హరీశ్‌ను కేసీఆర్ తొక్కేశారు కూడా. మంత్రి పదవి ఇవ్వకుండా చాలా నెలలు సతాయించారు. ఆ తర్వాత తత్వం బోధపడి హరీశే తగ్గారు. కేటీఆర్ నెగ్గారు. బీఆర్ఎస్‌కు చిన్న బాస్ అయ్యారు. ఇప్పుడు కారు పార్టీ పవర్‌లో లేదు. ఇద్దరూ సమానమే. ఇక్కడే అసలు అంతర్గత రాజకీయం రాజుకుంది.


సడెన్‌గా కేటీఆర్ పాదయాత్ర చేస్తానంటూ మీడియాకు లీకులిస్తున్నారు. వచ్చే ఏడాదేనంటూ ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు. జైలుకెళ్తా యోగా చేసుకుంటా.. పాదయాత్ర చేస్తా అని గతంలో ఏదో ఫ్లోలో అన్నారని అనుకున్నారు కానీ.. తాను నిజంగానే పాదయాత్ర ప్లాన్ చేస్తున్నానంటూ లేటెస్ట్‌గా విలేకర్లకు క్లారిటీ ఇచ్చారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. కేటీఆర్ పాదయాత్ర చేయాల్సిన అంత అర్జెంట్ అవసరం ఏమొచ్చింది? గతంలో వైఎస్సార్, చంద్రబాబులా తానూ పాదయాత్ర చేసి పవర్‌లోకి వద్దామనా? ఎన్నికల ముందరి ఏడాది పాదయాత్ర చేయడం సాంప్రదాయం. అలాంటిది ఎన్నికలైన ఏడాది, రెండేళ్లలోనే అంత హడావుడిగా కేటీఆర్ రోడ్డెక్కడానికి రీజన్ ఏంటి? సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజలు హ్యాపీగానే ఉన్నారు. ఇప్పటికే 9 హామీలు అమలయ్యాయి. మిగతావి కార్యచరణకు సిద్ధమవుతున్నాయి. ఈ టైమ్‌లో పాదయాత్ర వల్ల కేటీఆర్‌కు కలిగే ప్రయోజనం ఏంటి? అసలు పాదయాత్ర రీజన్ ఏంటి? ఇలా రకరకాల ప్రశ్నలు.

Also Read : టెంపర్‌మెంట్‌లో తగ్గేదేలే.. కేటీఆర్‌కు రేవంత్ మాస్ వార్నింగ్


బీఆర్ఎస్ అంతర్గత వర్గాలు మాత్రం కేటీఆర్ పాదయాత్ర గురించి మరో రకంగా చర్చించుకుంటున్నారని సమాచారం. కేటీఆర్ ప్రజల్లోకి వెళ్లేది.. పార్టీలో తాను బలపడేందుకేనని అంటున్నారు. అసలే అధికారం పోయి నేతలు గోడ మీద పిల్లుల్లా కూర్చున్నారు. కాంగ్రెస్ వాళ్లు పిలిస్తే గోడ దూకేసేందుకు రెడీగా ఉన్నారు. మరోవైపు, కారు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఫుల్లు. ప్రభుత్వం పడిపోయాక హరీశ్‌రావు మరింత యాక్టివ్ అయ్యారు. పవర్‌లో ఉన్నప్పుడు బావ చాటు బామ్మర్దిగా సర్దుకుపోయినా.. ఇప్పుడు మాత్రం తెగ హడావుడి చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారును విమర్శించడంలో ముందుంటున్నారు. రేసులో కేటీఆర్‌ను బీట్ చేస్తున్నారు. వరుస ప్రెస్‌మీట్లతో మామను మరిపిస్తున్నారు. హరీశ్ దూకుడు ముందు కేటీఆర్ తేలిపోతున్నారు.

కేటీఆర్ అప్పుడప్పుడు మాత్రమే బయటకు వచ్చి హంగామా చేస్తుండగా.. హరీశ్‌రావు మాత్రం ఫుల్ టైమ్ లీడర్‌గా కనిపిస్తున్నారు. ఈ యాక్టివ్‌నెస్సే కేడర్‌ను ట్రబుల్ షూటర్ వైపు మళ్లేలా చేస్తోందని అంటున్నారు. చాలా మంది నాయకులు హరీశ్‌రావు నాయకత్వానికే జై కొడుతున్నారట. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు కనుక.. హరీశ్‌కే BRSLP పదవి కట్టబెట్టాలని పార్టీ అంతర్గత మీటింగ్స్‌లో డిమాండ్లు కూడా చేస్తున్నారట. ఈ విషయం తెలిసే కేటీఆర్ అలర్ట్ అయ్యారని చెబుతున్నారు. పార్టీలో తన పట్టు పెంచుకునేందుకే పాదయాత్ర ఆలోచన చేస్తున్నారని టాక్. బావ దూకుడును తట్టుకోలేకే.. కాలినడకన జిల్లాలు చుట్టేసి.. తన వర్గాన్ని సమీకరించుకొనే ఎత్తుగడనే కానీ.. కాంగ్రెస్ సర్కారుపై పోరాటం కాదనేది బీఆర్ఎస్ వర్గాల గుసగుస.

Related News

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

TG Number Plates: ఇకపై ఆ వాహనాలపై ‘తెలంగాణ పోలీస్’ స్టిక్కర్లు.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు

Union Bank Manager Fraud: 10 నకిలీ గోల్డ్ లోన్ అకౌంట్స్.. రూ.75 లక్షలు.. బయటపడ్డ యూనియన్ బ్యాంకు మేనేజర్ బాగోతం

Hyderabad News: అడ్డంగా దొరికిపోయిన కేఏ పాల్‌.. పోలీసుల చేతుల్లో ఆయన గుట్టు

Hyderabad: ఘనంగా సెలబ్రిటీ డాండియా నైట్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

Big Stories

×