E-Paper
Advertisement

Harish Rao : హరీశ్‌కు కీలక పదవి.. కేటీఆర్ అరెస్టు భయం వల్లేనా?

Harish Rao : హరీశ్‌కు కీలక పదవి.. కేటీఆర్ అరెస్టు భయం వల్లేనా?

బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా గులాబీ బాస్ సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీలోనూ తీవ్ర చర్చ జరుగుతున్నది.. జవనరి 2 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో నదీ జలాలపై చర్చ జరగనున్నది. దీనిపై బీఏసీలోనూ ఇప్పటికే తీర్మానం చేశారు. ఈ సెషన్స్‌కు కేసీఆర్ వస్తారా? రారా? అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం నందినగర్‌లోని ఇంట్లోనే కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఆయన ఇంకా ఫాంహౌస్‌కు వెళ్లలేదని తెలుస్తుండగా..ఇక్కడే ఉన్నందున సమావేశాలకు హాజరవుతారని ఓవైపు టాక్ వినిపిస్తుండగా.. లేదు ఆయన స్థానంలో సిద్ధిపేట ఎమ్మెల్యే , మాజీ మంత్రి హరీశ్ రావు నదీ జలాలపై ప్రభుత్వానికి సమాధానం చెబుతారని సమాధానాలు వినిపిస్తున్నాయి.

హరీశ్ రావే ఎందుకు..

మాజీ సీఎం, గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నట్టుండి కీలక నిర్ణయం తీసుకున్నారు.అసెంబ్లీ, మండలికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమించారు. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నియమించారు. ఇక శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. మండలిలో పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ను నియమించారు. అయితే, హరీశ్ రావు‌ను డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ప్రకటించడంతో కేసీఆర్ వస్తారా? అనేదానిపై సందిగ్దత నెలకొంది. మరోవైపు కేసీఆర్‌కు ప్రస్తుతం ఆరోగ్యం సహకరించడం లేదని, అందుకే అధికార పార్టీ అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతారని కూడా టాక్ వినిపిస్తున్నది. నదీ జలాల అంశం కాబట్టి గతంలో ఆయనే నీటి పారుదల శాఖ మంత్రిగా చేసినందున కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని కూడా చర్చ జరుగుతున్నది.

కేటీఆర్‌కు చాన్స్ ఎందుకు ఇవ్వలేదు..

ప్రస్తుతం కేటీఆర్ పార్టీ వర్కింగ్ర ప్రెసిడెంట్‌గా కీలక వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఎన్నికల్లో ఆయనే ముందుండి పార్టీని నడిపిస్తున్నారు.దీనికితోడు ఆయనకు నదీ జలాలపై పెద్దగా అవగాహన లేదని కూడా టాక్ వినిపిస్తున్నది. గతంలో కేటీఆర్ మున్సిపల్, ఐటీ మంత్రిగా పనిచేశారు. వాటర్ సమస్యల గురించి పెద్దగా తెలిసే అవకాశం లేదు. మరోవైపు త్వరలోనే ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ అరెస్టు ఉంటుందని టాక్ వినిపిస్తున్నది. ఈ కోణంలోనూ కేటీఆర్ స్థానంలో హరీశ్ రావుకు చాన్స్ ఇచ్చి ఉంటారని ప్రచారం జరుగుతోంది.

 

Read Also : AP Politics: వైసీపీకి కలిసిరాని 2025.. పార్టీ ఇమేజ్ ఫుల్ డ్యామేజ్, చివర్లో రప్పా రప్పా కూడా

ఇదిలాఉంటే, హరీశ్ రావు వెన్నుపోటు పాలిటిక్స్ గురించి ఇటీవల పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అధికార పార్టీనేతలు కేసీఆర్‌కు వెన్నుపోటు తప్పదని ఆరోపించారు. హరీశ్‌కు పార్టీలో ప్రాతినిధ్యం తగ్గిందని, ఆయన వర్గం అసంతృప్తిలో ఉందంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు అధికార పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే హరీశ్‌కు పార్టీలో పెద్దపీట వేస్తున్నామని చెప్పడానికే గులాబీ బాస్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని కూడా చర్చ జరుగుతున్నది.పార్టీలో హరీశ్.. కేసీఆర్ తర్వాత రెండు లేదా మూడో స్థానంలో ఉన్నారని చెప్పడానికే ఇలా చేశారని ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉంటే, కేటీఆర్ జైలుకు వెళ్లాక హరీశ్ పార్టీని హస్తగతం చేసుకోవడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×