BigTV English

Taraka Ratna : తారకరత్న హెల్త్ రిపోర్ట్.. ఆ విషయంపై ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు..?

Taraka Ratna : తారకరత్న హెల్త్ రిపోర్ట్.. ఆ విషయంపై ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు..?

Taraka Ratna :బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యంపై వైద్యులు ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. సోమవారం విడుదల చేసిన హెల్త్ రిపోర్ట్ లో కీలక అంశాలను ప్రస్తావించలేదు. బయట జరుగుతున్న ప్రచారానికి వివరణ ఇచ్చే ప్రయత్నంగా ఆ వైద్య నివేదిక ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


తారకరత్న ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. ఎక్మోపై చికిత్స అందిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ ప్రచారానికి చెక్ పెట్టడానికే తాజా హెల్త్ రిపోర్ట్ ఇచ్చారని స్పష్టమవుతోంది. అయితే అదే సమయంలో తారకరత్నకు వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. తారకరత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ప్రకటించారు. జరుగుతున్న ట్రీట్ మెంట్ విషయంలో ఇక్కడ వరకే క్లారిటీ ఇచ్చారు. కానీ ఇంకా ఎన్నో అంశాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఆ విషయాలను హెల్త్ రిపోర్ట్ లో పేర్కొనకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తారకరత్న కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు ఆరోగ్యస్థితిపై సమాచారాన్ని అందిస్తున్నామని నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు. అంటే తారకరత్న పరిస్థితిపై పూర్తి సమాచారం కుటుంబ సభ్యులకు చెప్పారని అర్థమవుతోంది. ఆ విషయాలను మాత్రం వైద్య నివేదికలో ప్రస్తావించలేదని స్పష్టమైంది. తారకరత్న బ్రెయిన్ డ్యామేజ్ పై వైద్యులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.


మరోవైపు నందమూరి కుటుంబ సభ్యులు వైద్యులు చెప్పిన విషయాలనే వెల్లడించారు. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని నందమూరి రామకృష్ణ తెలిపారు. శరీరంలోని అవయవాలన్నీ పని చేస్తున్నాయని వివరించారు. పాక్షిక వెంటిలేషన్‌ సాయంతో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. తీవ్ర గుండెపోటు వల్ల నరాల వ్యవస్థ దెబ్బతిందని… రికవరీకి సమయం పడుతుందని తెలిపారు. మెదడుకు సంబంధించిన సమస్య తప్ప అంతా సవ్యంగానే ఉందన్నారు. తాను కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొన్నానని రామకృష్ణ చెప్పారు. ఈ విషయం కాస్త ఊరట కలిగించేలా ఉంది. ఇంకోవైపు బాలకృష్ణ ఆస్పత్రి వద్దే ఉండి వైద్యులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటున్నారు.

మొత్తంమీద తారకరత్న బ్రెయిన్ డ్యామేజీపై రామకృష్ణ కాస్త సమాచారం చెప్పే ప్రయత్నం చేశారు. వైద్యులు ఆ విషయం గురించి ప్రస్తావించకపోవటంతో అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×