E-Paper
Advertisement

Tech Development:అమెరికాకు ఇటలీ సాయం.. సైన్స్ అండ్ టెక్నాలజీలో..

Tech Development:అమెరికాకు ఇటలీ సాయం.. సైన్స్ అండ్ టెక్నాలజీలో..
Advertisement

Tech Development:సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు.. అభివృద్ధి చెందుతున్న దేశాలకంటే ముందంజలో ఉన్నాయి. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఊహించని విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధనలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాయి. అందుకే అభివృద్ధి చెందిన దేశాలకు భయం మొదలయ్యింది. అందుకే ఒక్కొక్కటిగా కాకుండా కలిసి సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాయి.

అమెరికా.. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ఇప్పటికే ఎన్నో అనూహ్య విజయాలను సాధించింది. కానీ ఇతర దేశాలు కూడా అమెరికాకు సమానంగా వాటి పరిశోధనలను చేపడుతున్నాయి. ముఖ్యంగా చైనాను అడ్డుకునేందుకు అమెరికా.. ఇటలీ సాయం తీసుకోనుంది. అందులో భాగంగానే తాజాగా యూఎస్, ఇటలీ జాయింట్ కమిషన్ మీటింగ్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సమావేశం పూర్తయ్యింది.

Advertisement

ఈ జాయింట్ కమిషన్ మీటింగ్ ఇటలీలో నిర్వహించారు. పలు ప్రభుత్వాధికారులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. జాయింట్ కమిషన్ మీటింగ్ 25 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యింది. ఇది దేశాల మధ్య దూరాన్ని తగ్గించి, సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో రెండు దేశాలు కలిసి పనిచేసేలాగా చేస్తుంది. తాజాగా అమెరికా, ఇటలీ మధ్య జరిగిన జాయింట్ కమిషన్ మీటింగ్‌లో ఎన్నో విషయాలపై చర్చలు జరిగాయి.

వాతావరణ మార్పులు, పర్యావరణంలో మార్పులు, న్యూక్లియర్ ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్, హెల్త్ సెక్టార్, టెక్నాలజీ, వంటి అనేక విషయాలపై అమెరికా, ఇటలీ చర్చించుకున్నారు. ఈ మీటింగ్ ద్వారా ఒక దేశంలోని శాస్త్రవేత్తలకు మరో దేశంలో కూడా పరిశోధనలు చేసే అవకాశం ఏర్పడుతుందని వారు భావిస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఎన్నో విభాగాలు అభివృద్ధి చెందడానికి అమెరికా, ఇటలీ కలిసి పనిచేయనున్నారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×