BigTV English

Weather News: మరి కాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. పిడుగులు పడే ఛాన్స్

Weather News: మరి కాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. పిడుగులు పడే ఛాన్స్

Weather News: ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో వింత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడో రావాల్సిన నైరుతి రుతుపవనాలు చాలా ముందుగానే వచ్చాయి. ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రైతులు కూడా వ్యవసాయ పనుల్లో బిజీబిజీ అయిపోయారు. పలు జిల్లాల్లో ఇప్పటికే పత్తిగింజలు కూడా పెడుతున్నారు. కొందరు నార్లు కూడా పోశారు. మరి కొంత మంది రైతులు పొలాలను ఇప్పుడే చదును చేస్తున్నారు. పంటపొలాల్లో రైతు నేస్తాలు ఆరుద్ర పురుగులు దర్శనం ఇస్తున్నాయి. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.


ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ భాగ్యనగర వాసులకు కీలక అప్డేట్ ఇచ్చింది. మరి కాసేపట్లో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. నాచారం, మల్లాపూర్, ఈసీఐఎల్, మౌలాలి, తార్నాక, చర్లపల్లి, రాంపెల్లి, బోడుప్పల్, సికింద్రాబాద్, ముషీరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం పడనుందని పేర్కొంది. రాత్రి 7:30 నుంచి 9 గంటల ప్రాంతంలో వర్షం పడే ఛాన్స ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏరియాల్లో నివసించే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే ఈ రోజు రాత్రి 10 గంటల లోపు మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పిడుగుల పడే  ఛాన్స్ ఉందని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, కుమురం భీం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని చెప్పారు.

ALSO READ: రాష్ట్రంలో భారీ వర్షం.. పిడుగులు పడే ఛాన్స్


తెలుగు రాష్ట్రాలో గత వారం రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. సేమ్ టైం.. పగటి వేళ ఎండలు కూడా దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో అయితే ఉరుములు, మెరుపులో కూడిన వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో పిడుగులు బీభత్సం సృష్టించడంతో.. కొంతమంది చనిపోయారు. అయితే రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.

ఉపరితల గాలులు పశ్చిమ నైరుతి దిశలో గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని చెబుతున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ రెండు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు.

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×