Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వాతావరణంలో విభిన్నమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఎప్పుడో రావాల్సిన నైరుతి రుతుపవనాలు ఈ సారి చాలా ముందుగానే వచ్చాయి. ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా వ్యవసాయ పనుల్లో పడిపోయారు. పలు జిల్లాల్లో ఇప్పటికే పత్తి గింజలు విత్తినారు. కొందరు నార్లు సైతం పోశారు. కొంత మంది రైతులు ఇప్పుడిప్పుడే భూములను చదును చేస్తున్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. గత కొన్ని రోజుల నుంచి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పిడుగుల కారణంగా ఇద్దరు ముగ్గురు . ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 7 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
ALSO READ: IAF Notification: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో భారీగా ఉద్యోగాలు.. పది, ఇంటర పాసైతే చాలు
రేపటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడవచ్చని వివరించింది. ఈ రోజు, రేపు హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడొచ్చని అధికారులు తెలిపారు. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉపరితల గాలులు పశ్చిమ నైరుతి దిశలో గంటకు 6 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉండడంతో.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ: Snakes: వర్షాకాలం జాగ్రత్త.. పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..
తెలంగాణ రాష్ట్ర రైతులు పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని అధికారులు చెప్పారు చెట్లపై పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని వివరించారు. ఈ అసాధారణ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ సూచనలను తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు.