Sreenu Vaitla : సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల జీవితం అని చెప్పాలి. ఈ సినీ ఇండస్ట్రీలో ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి రంగు పులుముకుంటుందో తెలియదు. కొంతమంది రాత్రికి రాత్రి స్టార్ సెలబ్రిటీలుగా మారిపోతే మరికొంతమంది అవకాశాలు లేక ఇండస్ట్రీని కూడా వదులుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇలా ఎంతోమంది ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోగా మరికొందరు ఇండస్ట్రీలో సక్సెస్ అందుకొని దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు టాలీవుడ్ హీరోలందరికి మంచి సక్సెస్ సినిమాలను అందించిన దర్శకులు ఇప్పుడు పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా ఒకానొక సమయంలో స్టార్ డైరెక్టర్లుగా వెలిగినటువంటి వారిలో దర్శకుడు శ్రీనువైట్ల(Sreenu Vaitla) ఒకరు.
శ్రీను వైట్ల నీకోసం అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు కానీ ఈ సినిమా ఆయనకు అనుకున్న స్థాయిలో సక్సెస్ అందించలేకపోయింది. ఇక 2001 వ సంవత్సరంలో వచ్చిన ఆనందం అనే సినిమా ద్వారా దర్శకుడుగా తనని తాను నిరూపించుకున్నారు. ఇక ఈయన తన కెరియర్ లో ఎన్నో కామెడీ యాక్షన్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేశారు. శ్రీను వైట్ల సినీ కెరియర్లో సొంతం, వెంకీ, ఢీ, దూకుడు, రెడీ, దుబాయ్ శీను వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను సందడి చేశారు.
ఇకపోతే శ్రీను వైట్ల సినిమాల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేయడంతో వరుస ఫ్లాప్ సినిమాలు వెంటాడాయి. ఇలా వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈయనకు అవకాశాలు ఇచ్చే నిర్మాతలు దర్శకులు కూడా లేకుండా పోయారు. దీంతో శ్రీను వైట్ల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈయనకు హీరో గోపీచంద్(Gopi Chand) అవకాశం ఇచ్చారు. గోపీచంద్ కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా విశ్వం (Vishwam)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.
ఇలా ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల తిరిగి సినిమాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈయన మరోసారి అద్భుతమైన కామెడీ సినిమా ద్వారా రాబోతున్నారని తెలుస్తుంది. కామెడీ నేపథ్యంలో ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారని, అయితే ఈ కథను మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) వారికి వినిపించడంతో శ్రీను వైట్లతో సినిమా చేయటానికి మైత్రి వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు హీరో హీరోయిన్ల వివరాలను కూడా తెలియజేయబోతున్నారు. మరి ఫ్లాప్ లతో సతమతమవుతున్న డైరెక్టర్ శ్రీను వైట్లకు ఇదొక గొప్ప అవకాశం అని చెప్పాలి. మరి ఈ అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారో తెలియాల్సి ఉంది.