BigTV English

Heavy Rain: సెలవురోజని బయటకెళ్లిన నగరవాసులు.. ఇంతలోనే భారీ షాక్

Heavy Rain: సెలవురోజని బయటకెళ్లిన నగరవాసులు.. ఇంతలోనే భారీ షాక్

Heavy Rainfall in Hyd: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో భారీగా వర్షం కురుస్తోంది. గురువారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమైన వర్షం సుమారుగా గంటకుపైగా నుంచి దంచి కొడుతుంది. రహదారులపైకి వరద నీరు వచ్చి చేరడంతో చాలా చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నగరవ్యాప్తంగా వర్షం భారీగా కురుస్తోంది. బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ఆర్ నగర్, మధురానగర్, సనత్ నగర్, ఈఎస్ఐ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, గాంధీ నగర్, కవాడీగూడ, జగద్గిరిగుట్ట, దోమలగూడ, షాపూర్, బాలానగర్, జీడిమెట్ల, సుచిత్ర, బాచుపల్లి, ప్రగతినగర్, కేపీహెచ్ బీ కాలనీ, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, నారాయణగూడ, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి, నాంపల్లి, సికింద్రాబాద్, తిరుమలగిరి, బోయిన్ పల్లి, అల్వాల్, ప్యాట్నీ, బేగంపేట్, ప్యారడైజ్, మారేడ్ పల్లి, చిలకలగూడ, మారేడ్ పల్లి, మేడ్చల్, సంతోష్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురంతోపాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సెలవు రోజు కావడంతో ఇంటి నుంచి బయటికొచ్చిన నగరవాసులు తడిసి ముద్దయ్యారు.


అదేవిధంగా నగరంలో మరింతగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తోంది. పలు చోట్ల భారీగా వర్షం కురవడంతో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.


Also Read: రైతులకు తీపి కబురు.. రుణమాఫీ మూడో విడత నిధులు విడుదలయ్యాయి.. చెక్ చేసుకున్నారా?

ఇటు వాతావరణ శాఖ కూడా కీలక సూచన చేసిన విషయం తెలిసిందే. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో వర్షం కురవనున్నదని పేర్కొన్నది. మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని వివరించింది. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తమంగా ఉండాలని సూచనలు చేసింది.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×