E-Paper
Advertisement

TS rain news : తెలంగాణలో రేపు భారీ వర్షాలు.. నేడు మోస్తరు వానలు..

TS rain news : తెలంగాణలో రేపు భారీ వర్షాలు.. నేడు మోస్తరు వానలు..
Advertisement
Telangana rainfall update

Telangana rainfall update(TS news updates) : తెలంగాణను మరోసారి వానలు ముంచెత్తనున్నాయి. ఆగస్టు 1 భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, మహబూబాబాద్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

సోమవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ కేంద్ర ప్రకటించింది. ఆదివారం సంగారెడ్డి జిల్లా జన్నారంలో 40.3 మిల్లీ మీటర్లు, మేడ్చల్‌ లో 37.5 మిల్లీ మీటర్లు, మెదక్‌ జిల్లా కాగజ్‌ మద్దూర్ లో‌ 35 మిల్లీ మీటర్ల, యాదాద్రి జిల్లా బీబీనగర్ లో‌ 27.5 మిల్లీ మీటర్లు, నిర్మల్‌ జిల్లా విశ్వనాథ్‌పూర్ లో‌ 27 మిల్లీ మీటర్లు, సంగారెడ్డి జిల్లా లక్ష్మిసాగర్ లో‌ 26.8 మిల్లీ మీటర్లు, మేడ్చల్‌ జిల్లా కేశవరంలో 26 మిల్లీ మీటర్లు, ఆలియాబాద్‌ లో 25 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Advertisement

వికారాబాద్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌, జనగామ, మహబూబాబాద్‌, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలతోపాటు, జీహెచ్‌ఎంసీ పరిధిలో వానలు పడ్డాయి.

గతేడాదితో పోలిస్తే ప్రస్తుత సీజన్‌లో వర్షాలు 19 శాతం తక్కువగా ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత ఏడాది జూన్‌ నుంచి జులై 30 మధ్య 687.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని వివరించింది. ఈ ఏడాది వర్షాకాల సీజన్ లో ఇప్పటి వరకు 559.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది.

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×