Firing in Mumbai Jaipur Express(Breaking news of today in India) : జైపూర్ -ముంబై ఎక్సెప్రెస్ లో కాల్పులు ఘటన తీవ్ర కలకలం రేపింది. B-5 కోచ్ లో ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆర్ఫీఎస్ ఏఎస్ఐ సహా నలుగురు మృతిచెందారు. మహారాష్ట్రలోని దహీసర్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
నిందితుడు చేతన్ కాల్పులు జరిపిన వెంటనే ట్రైన్ నుంచి దూకేశాడు. అక్కడ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కాల్పులు ఎందుకు జరిపాడన్న దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రయాణికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు.
ఇటీవల వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులకు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఆ ప్రమాదాలపై అనేక అనుమానాలు వ్యక్తవుతున్నాయి. ఇప్పుడు ట్రైన్ లో కాల్పులు జరగడం మరింత కలవరానికి గురిచేస్తోంది. ఇలాంటి ఘటనలతో రైలు ప్రయాణికుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.