E-Paper
Advertisement

Rains : తెలంగాణలో అప్పటి వరకు భారీ వర్షాలు.. వాతావరణశాఖ వార్నింగ్..

Rains : తెలంగాణలో అప్పటి వరకు భారీ వర్షాలు.. వాతావరణశాఖ వార్నింగ్..
Advertisement

Rain news in telangana(TS news updates) : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. మంగళవారం భారీ వానలు పడతాయని హెచ్చరించింది. బుధవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఇప్పటికే ఆరెంజ్‌ అలెర్ట్ జారీ చేసింది. గురు, శుక్రవారాల్లోనూ భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ పేర్కొంది.

బుధవారంలోగా బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. మరోవైపు ఝార్ఖండ్‌ దక్షిణ ప్రాంతంపై 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆ ఆవర్తనాల ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అందువల్లే భారీ వానలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ సహా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి.

Advertisement

సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు తెలంగాణళో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మెండోరాలో 1.9 సెంటీమీటర్లు ,
నిర్మల్‌ జిల్లా భైంసాలో 1.2 సెంటీమీటర్లు, జగిత్యాల జిల్లా గోధూరులో 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×