BigTV English

NTR : టార్గెట్ లోకేష్.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం..

NTR : టార్గెట్ లోకేష్.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం..
Jr NTR fans fires on nara lokesh

Jr NTR fans fires on Nara Lokesh(AP latest news): ప్రకాశం జిల్లా ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్‌ అంటూ ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. మంగళవారం ప్రకాశం జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర ఉన్న సమయంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఫ్లెక్సీల్లో నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్..అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే అని రాసి ఉంది.


గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇవి ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ సమీపంలో ఫ్లై ఓవర్ కింద, మరో రెండు చోట్ల ఈ ఫ్లెక్సీలు పెట్టారు. ఫ్లెక్సీలు పెట్టింది ఎవరన్నది ఇంకా తెలియలేదు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పనే అని భావిస్తున్నారు. ఈ ఫ్లెక్సీలతో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు.

ఇటీవల టీడీపీ కార్యక్రమాల్లో తరచూ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో అభిమానులు హంగామా చేస్తున్నారు. పార్టీ సభల్లో నినాదాలు చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం తానా సభల్లోనూ ఇదే అంశంపై వివాదం చెలరేగింది. ఈ అంశంపై వాదనలు జరగడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి ఫ్లెక్సీ వివాదం టీడీపీలో కాక రేపుతోంది.


Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×