Road Incident On ORR: హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో రోడ్డు ప్రమాదం. ఔటర్ రింగ్ రోడ్డుపై ఒకదానికి ఒకటి ఢీ కోట్టడంతో వరుసగా ఉన్న 9 కార్లు ధ్వంసం అయ్యాయి. కార్లో ఉన్న ప్రయాణికులకు మాత్రం ప్రమాదం తప్పింది. కానీ, స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మితి మీరిన వేగంతో దూసుకు వచ్చిన కారు డ్రైవర్ ఔటర్ రింగ్ రోడ్డుపై 2 కిలో మీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో హై స్పీడ్‌గా వచ్చిన కారు సడెన్ బ్రెక్ వేయడంతో వరుసగా ఒకదానిక కోకటి ఢి కొట్టడంతో 9 కార్లు తుక్కు తక్కు అయ్యాయి.
Also Read: కొండా కొట్లాట! తగ్గేదెవరు.. నెగ్గేదెవరు?
ఈ ఘటన స్థలానికి ORR సిబ్బంది కూడా చేరుకుంది. అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే ఈ ఘటనాలో గాయపడ్డవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాల గురించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఔటర్ రింగ్ పై ప్రయాణించే వారు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అతివేగం తగ్గించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.