E-Paper
Advertisement

Telangana High Court: సిగాచి పేలుళ్ల దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం.. డీఎస్పీ హాజరు కావాలని ఆదేశం

Telangana High Court: సిగాచి పేలుళ్ల దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం.. డీఎస్పీ హాజరు కావాలని ఆదేశం
Advertisement

Telangana High Court: తెలంగాణ హైకోర్టు సిగాచి పేలుళ్ల ఘటన దర్యాప్తు తీరుపై పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై (PIL) ప్రధాన న్యాయమూర్తి (సీజే) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ ఘటన సాధారణమైంది కాదని.. ఇందులో 54 మంది కార్మికులు చనిపోయారని సీజే వ్యాఖ్యానించారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) కోర్టుకు తెలిపారు. దీనిపై సీజే ప్రశ్నిస్తూ.. 237 మంది సాక్షులను విచారించినా ఇప్పటి వరకు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం ఏమిటని నిలదీశారు.

ఇంత పెద్ద ఘటన జరిగితే ఇంతవరకు బాధ్యులు ఎవరో ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. పేలుడు సంభవించి ఐదు నెలలు దాటినా ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇంత పెద్ద ఘటనకు డీఎస్పీని దర్యాప్తు అధికారిగా నియమించడంపై సీజే తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ స్థాయి ఘటనకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాల్సింది కదా అని వ్యాఖ్యానించారు. పోలీసు దర్యాప్తు తీరుపై సంతృప్తి చెందకపోవడంతో.. తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి (డీఎస్పీ) కోర్టు ఎదుట హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.

Advertisement

నిపుణుల కమిటీ నివేదిక అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రస్తావించారు. పరిశ్రమ నిర్వహణలో లోపాలు ఉన్నాయని.. నిబంధనలకు విరుద్ధంగా 17 టన్నుల సోడియం క్లోరైడ్‌ను నిల్వ చేశారని నివేదికలో తేలిందని తెలిపారు. పేలుడు తీవ్రత అధికంగా ఉండటంతో 8 మంది మృతదేహాలు ఆనవాళ్లు లేకుండా కాలిపోయాయని న్యాయవాది వాదించారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఏఏజీ కోర్టుకు తెలియజేశారు.

అయితే, హైకోర్టు పోలీసు దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరగడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Advertisement

ALSO READ: Birthday Celebration: బర్త్ డే బంప్స్.. స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పటించి కేరింతలు కొట్టిన ఫ్రెండ్స్, చివరికి…

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×