Bigg Boss AgniPariksha Promo:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మరొకసారి ఎంటర్టైన్ చేయడానికి త్వరలో రాబోతోంది బిగ్ బాస్ రియాలిటీ షో. తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 9వ సీజన్ కి సిద్ధం అయింది.2025 సెప్టెంబర్ 5 నుండి ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే కింగ్ నాగార్జున (Nagarjuna) ఈ షో కి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇకపోతే తాజాగా ఈ సీజన్ సరికొత్త ట్విస్టులతో రాబోతోంది అని చెప్పవచ్చు. డబుల్ హౌస్.. డబుల్ డోస్.. డబుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ షోపై భారీ హైప్ తీసుకొచ్చిన నాగార్జున.. ఈసారి ఏకంగా 5 మందిని కామన్ మ్యాన్ క్యాటగిరిలో హౌస్ లోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు.
బిగ్ బాస్ కంటే ఎక్కువ హీట్ పుట్టిస్తున్న అగ్నిపరీక్ష..
అందులో భాగంగానే సామాన్య ప్రజల నుండి 20వేలకు పైగా అప్లికేషన్లు రాగా.. ఫిల్టర్ చేసి 45 మందిని ఎంపిక చేశారు. వీరిలో 15 మంది ఇప్పుడు ఫైనలైజ్ అయ్యారు. ఈ 15 మందికి ‘అగ్నిపరీక్ష’ అంటూ ఒక మినీ షో నిర్వహించి, ఇందులో జడ్జిలు పెట్టే కఠినమైన పరీక్షలు పాసైన ఐదు మందిని హౌస్ లోకి పంపించనున్నారు. ఈ బిగ్ బాస్ అగ్నిపరీక్ష మినీ షో కి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ నవదీప్(Navadeep) , అభిజిత్(Abhijith), బిందు మాధవి (Bindu madhavi)జడ్జిలుగా వ్యవహరిస్తూ ఉండగా.. ప్రముఖ యాంకర్ శ్రీముఖి (Srimukhi)హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 5 వరకు జియో హాట్స్టార్ వేదికగా ఈ అగ్నిపరీక్ష షో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ షో కి సంబంధించి గత కొద్ది రోజులుగా ప్రోమోలు రిలీజ్ చేసిన మేకర్స్ ఈరోజు రెండవ ఎపిసోడ్ కి సంబంధించిన మొదటి ప్రోమోను విడుదల చేశారు.
అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2 ప్రోమో రిలీజ్..
తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమో చూస్తుంటే వీళ్ళు సామాన్యులు కాదు.. జడ్జిలకే ఝలక్ ఇస్తూ హౌస్ లోకి అడుగు పెట్టకముందే ఫైర్ పుట్టిస్తున్నారని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా జడ్జిలకే ఎదురు సమాధానం చెబుతూ అటు శ్రీముఖి నోరు కూడా మూయించారు. మరి ఈ ప్రోమో ఎలా ఉంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.
వీళ్లు సామాన్యులు కాదు..
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో.. స్టేజ్ పైకి ఎంటర్ అవ్వగానే ఒక అమ్మాయి అటు జడ్జెస్ ఇటు హోస్ట్ శ్రీముఖికి హడల్ పుట్టిస్తూ ఎంట్రీ ఇచ్చిన తీరుకు అందరూ ఆశ్చర్యపోయారు. అడుగుపెట్టగానే అందరిలో అటెన్షన్ మొదలయ్యిందా అంటూ అడగడంతో జడ్జెస్ కూడా షాక్ అయ్యారు. ఆ అమ్మాయితో నవదీప్ బిగ్ బాస్ కి ఎందుకు పంపాలి నిన్ను అని అడగ్గా.. ఎందుకు పంపకూడదు? అంటూ ఎదురు ప్రశ్నించింది. వెంటనే శ్రీముఖి కలుగజేసుకుని.. ఇలా మొత్తుకుంటే ఏం అరుస్తోంది ఈ పిల్ల అంటూ టీవీ బంద్ చేస్తారని శ్రీముఖి అంటే.. ఆ అమ్మాయి సీజన్ 2 ,3 ఆ అక్క నువ్వు.. చేసేవాళ్లయితే అప్పుడే బందు చేసే వాళ్లు కదా అంటూ కౌంటర్ వేసింది. ఇంకా ఇది చూసిన అభిజిత్ వెంటనే ఆమెకు రెడ్ కార్డు చూపించగా.. ఆమె పవర్ఫుల్ గా ఉండే వ్యక్తుల్ని చూసి హ్యాండిల్ చేయలేక ముందే రెడ్ టికెట్ ఇచ్చేసారా అంటూ కౌంటర్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారగా.. ఈ సామాన్యులంతా ఇప్పుడు అగ్నిపరీక్ష స్టేజ్ పై ఫైర్ పుట్టిస్తూ ఆసక్తి పెంచుతున్నారని చెప్పవచ్చు.
also read: Mega157 Glimpse:ఎవరీ శంకరవరప్రసాద్… అదిరిపోయిన టైటిల్ గ్లింప్స్.. బాస్ ఈజ్ బ్యాక్!