Himayatsagar: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు, మూడు గంటల్లో రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 21 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురించాయి. కుండపోత వర్షానికి హైదరాబాద్ తడిచి ముద్దయ్యింది. భాగ్యనగరంలోని ఐదు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్ష పాతం నమోదు అయ్యింది.
హైదరాబాద్ నగరంలోపాటు శివారు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం దంచికొట్టింది. దీంతో భాగ్యనగరం అతలాకుతలమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే రోడ్లు నదులను తలపించాయి. ఫలితంగా వాహనదారులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు.
భారీ వరద పోటెత్తడంతో హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో అధికారులు ఒక గేటు ఎత్తి వరదను మూసీలోకి విడుదల చేశారు. బహదూర్ పురా సీఐతో కలిసి మూసీ పరివాహక ప్రాంతాలను పరిశీలించారు ఫలక్ నుమా ఏసీపీ జావిద్. లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు.
హిమాయత్ సాగర్ పూర్తి నీటిమట్టం 1763.50 అడుగులు. అయితే ప్రస్తుతం 1762.70 అడుగులకు నీరు చేరింది. జలాశయంలో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 2.97 టీఎంసీలు. ప్రస్తుతానికి 2.73 టీఎంసీలకు నీరు చేరింది. హిమయత్‌సాగర్‌కు వెయ్యి క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఔట్ ఫ్లో 339 క్యూసెక్కులుగా ఉన్నట్లు జలాశ్రయం అధికారులు తెలిపారు.
ALSO READ: హైదరాబాద్ లో భారీ వర్షం.. రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదు
జలాశయం నిండడంతో మూసీ పరివాహక ప్రజలు అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ సిటీ, శివారు ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిచే అవకాశమున్నట్లు పేర్కొంది.
భారీ వర్షానికి హైదరాబాద్ సిటీలోని పలు కాలనీలు నీట మునిగాయి. కురిసిన వర్షానికి అపార్టుమెంట్ల సెల్లార్లలోకి వరద నీరు వచ్చి చేరింది. వాహనాలు నీట మునిగిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే మణికొండ మున్సిపల్ కమిషనర్ స్పాట్‌కు చేరుకుని సెల్లార్లలో నీటిని క్లియర్ చేయించారు. రోడ్లకు గండి కొట్టి మోటార్లతో వర్షపు నీటిని బయటకు తరలించారు. అలాగే కైరా స్కూలు సమీపంలోని ఓ ఇళ్లు కూలిపోయింది.
హిమాయత్ సాగర్ నీటిమట్టం పెరగడం, ఓ గేటు తెరవడంతో అప్రమత్తమైన ఫలక్ నుమా ఏసీపీ జావిద్
బహదూర్ పురా సీఐతో కలిసి మూసీ పరివాహక ప్రాంతాల పరిశీలిన
లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేసిన పోలీసు అధికారులు https://t.co/z8DC2yPgyk pic.twitter.com/vosznhN0bM
— BIG TV Breaking News (@bigtvtelugu) August 8, 2025