Gundeninda GudiGantalu Today episode August 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం లేవగానే మీనా ముగ్గు వేయాలని బయటికి వెళ్తే.. ప్రభావతి బయట నిలబెట్టేస్తుంది ఆ విషయం తెలుసుకున్న బాలు ఏంటి మీనా ఇలా శిల్పం లాగా నిలబడ్డావు అని అడుగుతాడు. శిల్పం లాగా కాదండి మీ అమ్మగారు నన్ను ఇక్కడే నిలబడమని చెప్పారు అందుకే నేను ఇక్కడే నిలబడ్డానని అంటుంది. ఇది ఒక కొత్త పనిష్మెంట్ నా.. అదే చెప్తున్నాను అప్పుడు అక్కడికి వచ్చిన సత్యంతో బాలు చూసారా నాన్న మీ ఆవిడ మా ఆవిడని ఇక్కడ నిలబెట్టింది అని అంటాడు. ఇంట్లో నుంచి బలవంతంగా ప్రభావతి బయటకు తీసుకొని వస్తుంది. ఆలు పాలనమ్మ అంత పెద్ద తప్పు ఏమి చేసింది నువ్వు బయటికి గెంటేస్తున్నావ్ అని అడుగుతాడు. రోహిణి ఏమైందో తెలియక బిత్తర చూపులు చూస్తూ ఉంటుంది. రోహిణిని తీసుకురావడం చూసి బాలు షాక్ అవుతున్నాడు. ఇంట్లోంచి గెంటేస్తున్నట్లు అలా ఉన్నావేంటి అని ప్రభావతిని అడుగుతాడు.. ఈ పూజ అయిపోయేంతవరకు ప్రతిరోజు రోహిణి ముగ్గు వేయాలని కండిషన్ పెడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి, మనోజ్ కు చుక్కలు చూపించి బాలు టిఫిన్ చేస్తుండగా ఫారిన్ ఆవిడ ఫోన్ చేస్తుంది.. ఎవర్రా ఈ ఫారిన్ ఆవిడ అని అంటాడు సత్యం. ఈమె నా కస్టమర్ నాన్న సారీ నుంచి వచ్చింది అని బాలు అంటాడు. ఇక బాలు టిఫిన్ చేసి కల్పన దగ్గరికి వెళ్తాడు. కల్పనను తీసుకొని ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే టికెట్ గురించి మాట్లాడుతుంది కల్పనా. మీకోసం భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు అతని పేరు మనోజ్ అని అక్కడ ఉన్న ఆవిడ చెప్పడంతో కల్పనా షాక్ అవుతుంది. మనోజ్ కి పెళ్లి అయిపోయింది అన్నమాట నాకోసం వెతుక్కుంటూ వచ్చారంటే నేను జాగ్రత్తగా ఉండాలని అనుకుంటుంది.
బాలు తన కష్టమని తీసుకొని వెళ్తాడు. కల్పన పార్లర్ కి వెళ్లాలని అనుకుంటుంది. పార్లర్ ఎక్కడుందో అని తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది.. మనం వెళ్లే పార్లర్ క్లోజ్ చేస్తారని ఫ్రెండు చెప్పడంతో అయ్యో క్లోజ్ చేస్తారని ఫోన్లో అంటుంది.. బాలు మీరు పార్లర్ కి వెళ్లాలనుకుంటున్నారా నాకు తెలిసిన ఒక పార్లర్ ఉంది. మనిషి కాస్త తేడాగా ఉన్న కూడా పని మాత్రం బాగా చేస్తుంది అని రోహిణి పార్లర్కి తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్లిన కల్పనా నువ్వు చూసి రోహిణి షాక్ అవుతుంది..
వెతకబోయిన తీగ కాలికే తగిలినట్టు ఉంది అని సంతోషపడుతుంది. మీ పేరేంటి అని అడుగుతుంది కల్పనా అని చెప్తుంది.. నేను రెండు రోజుల క్రితమే ఇండియాకు వచ్చాను ఇక్కడ ఎండలు బాగా ఉన్నాయి కదా నాకు ఫేషియల్ మెడిక్యూర్ , పెడిక్యూర్ ఐబ్రోస్ కూడా చేయాలి అని అడుగుతుంది.. మీకు దగ్గరుండి అన్ని నేనే చేస్తాను మేడం అని అంటుంది.. పక్కకు వచ్చిన రోహిణి మనోజ్ కి ఫోన్ చేసి అసలు విషయాన్నీ చెప్తుంది.. నేను ఇప్పుడే వస్తున్నాను అని మనోజ్ అంటాడు.. రోహిణి మాత్రం కల్పనతో మాటలు పెట్టి ఏదో ఒక విధంగా మనోజ్ వచ్చేంత వరకు వెయిట్ చేయించాలని అనుకుంటుంది.
నాకు టైం లేదు కదా.. వెంటనే పని చేయండి అని అడుగుతుంది. ఏం ఎందుకు టైం లేదు.. కొంపలు ముంచే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? దొంగతనాలు చేసే పని ఏదైనా పెట్టుకున్నావా? ఈసారి ఎవరిని మోసం చేయాలని చూస్తున్నావ్ అని రోహిణి తేడాగా మాట్లాడుతుంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ అని కల్పనా అంటుంది.. అప్పుడే మనోజ్ అక్కడికి వస్తాడు. నిన్న ఎంత నమ్మాను.. నన్ను ఇలా మోసం చేసి ఎలా వెళ్లాలి అనుకున్నావ్.. నీవల్ల నేను మా ఇంట్లో దొంగనయ్యాను.. మా నాన్న రిటైర్మెంట్ డబ్బులు నీకు ఇచ్చి మోసగాన్నయ్యాను అని మనోజ్ కల్పనను అడుగుతాడు..
రోహిణి మనోజ్ ని మాట్లాడే ఇవ్వకుండా గట్టిగా మాట్లాడుతుంటే అసలు ఎవరిది అని అడుగుతుంది. నువ్వు మాట్లాడాలి కానీ ఇది ఎవరు ఇలా మాట్లాడుతుంది అని మనోజ్ ని అడుగుతుంది కల్పనా. దీని గురించి అన్ని మాట్లాడే రైట్ ఆమెకు ఉంది. తను నా భార్య. ఓ పర్లేదే దేవదాసు లాగా అయిపోయి ఉంటావని అనుకున్నాను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యావు ఇంకేం అని అంటుంది.. ఇదంతా కాదు మనోజ్ ముందు 40 లక్షల సంగతి తేల్చు అని రోహిణి అంటుంది.. ముందు పోలీసులకి ఫోన్ చెయ్యి అని రోహిణి చెప్తుంది..
Also Read : ఓటీటీల్లో సినిమాల జాతర.. ఇవాళ ఒక్కరోజే 15 సినిమాలు..
మరేం పర్లేదు రోహిణి నేను వచ్చేటప్పుడే పోలీసులు కంప్లైంట్ ఇచ్చి వచ్చాను కాసేపట్లో పోలీసులు లేడీస్ కానిస్టేబుల్ అందరు వస్తారు అని మనోజ్ అంటాడు.. కల్పనా గొంతు పట్టుకొని నీవల్ల దొంగనయ్యాను నువ్వు ఆ డబ్బులు ఇవ్వాల్సిందే అని అంటుంది.. ఇక అప్పుడే పోలీసులు వస్తారు.. పోలీసులను చూసిన కల్పన ఫ్లేట్ ఫిరాయిస్తుంది.. నన్ను కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు నా మీద మ్యాన్ హాండ్లింగ్ చేస్తున్నారు అని అంటుంది.. ఏది ఏమైనా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తెలుసుకుందామని ఎస్సై అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..