E-Paper
Advertisement

సునీల్ గవాస్కర్ నుంచి నేను నేర్చుకున్నది ఇదే.. అజహరుద్దీన్ సక్సెస్ మంత్ర!

సునీల్ గవాస్కర్ నుంచి నేను నేర్చుకున్నది ఇదే.. అజహరుద్దీన్ సక్సెస్ మంత్ర!
Advertisement

Minority Study: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలు, అవకాశాలను మైనారిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకుని, పట్టుదల, క్రమశిక్షణతో కష్టపడి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ పిలుపునిచ్చారు. సోమవారం ఇందిరా ప్రియదర్శిని జూనియర్ కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన‘ప్రభుత్వ మైనారిటీ స్టడీ సర్కిల్, కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ను ఆయన అధికారికంగా ప్రారంభించారు.

అజహరుద్దీన్ మాట్లాడుతూ..

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అజహరుద్దీన్ మాట్లాడుతూ.. నూతన కేంద్రం మైనారిటీ యువతకు అద్భుతమైన అవకాశమని పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటును వేగవంతం చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులను, ముఖ్యంగా డైరెక్టర్ తారిఖ్ అన్వర్‌ను అభినందించారు.”ప్రపంచంలో ఏదీ ఉచితంగా రాదు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలనూ కల్పించింది. విజయం సాధించాలంటే కష్టపడటమే దానికి చెల్లించాల్సిన మూల్యం. జీవితంలో ఏ లక్ష్యాన్ని ఎంచుకున్నా ప్యాషన్, పట్టుదల, అంకితభావం పెంచుకోవాలి” అని విద్యార్థులకు మంత్రి మార్గదర్శనం చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మైనారిటీల విద్య, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అందరి సూచనలు స్వీకరించే స్పష్టమైన విజన్ ఉన్న నాయకుడని ప్రశంసించారు.

Advertisement

Also Read: స్పీకర్‌పై వ్యాఖ్యలు.. రాజకీయాల్లో కొత్త వివాదం..!

క్రికెట్ కెరీర్ ప్రారంభంలో..

తానునేర్చుకోవడంలో ప్రశ్నించడం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు. తన క్రికెట్ కెరీర్ ప్రారంభంలో సునీల్ గవాస్కర్ నుంచి తరచూ సందేహాలు అడిగి తెలుసుకునేవాడినని గుర్తు చేసుకున్నారు. అలాగే నిజాం కళాశాలలో చదివే రోజుల్లో పరిమిత సౌకర్యాలు ఉన్నప్పటికీ చెట్టు కింద కూర్చుని చదువుకున్న తన ఇద్దరు స్నేహితులు ఈనాడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని, పరిస్థితులు ఎలా ఉన్నా పట్టుదల ఉంటే విజయం ఖాయమని స్పష్టం చేశారు. బాలికలు విద్య, ఉద్యోగాల్లో ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, బాలురు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.

Advertisement

Also read: మట్టి గణపయ్యను ఇంటికి తీసుకెళ్లండి.. హెచ్ఎండీఏ బంపర్ ఆఫర్

Tags

Related News

గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. సొంత డబ్బు ఇక బ్యాంకులో!

కాంట్రాక్టర్ యమ సేఫ్ ప్లాన్.. ఏసీబీకి చిక్కిన అధికారి.. ఎలా చిక్కారంటే..?

గవర్నర్ వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్ బిగ్ అప్డేట్.. సూచనలు చేస్తానని హమీ!

ఇందిరమ్మ టవర్స్‌లో ఎంపిక కాలేదా? మీ డబ్బు ఇలా వాపస్

మట్టి గణపయ్యను ఇంటికి తీసుకెళ్లండి.. హెచ్ఎండీఏ బంపర్ ఆఫర్

రేవంత్ vs కేసీఆర్.. సామాజిక స్పృహపై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

మీ అయ్య జాగీరా.. మా MLCలను సస్పెండ్ చేస్తావా? కేటీఆర్ ఫైర్

Big Stories

Advertisement
×