Kumuram Bheem District : తెలతెలవారు జామున అలా రోడ్డుపైకి వచ్చి, రోడ్డు మీద నడుస్తున్న వారికి గుండెలు గుబెలుమనే దృశ్యం కనిపించింది. నడిరోడ్డుపై మనుషుల ఎముకలు పెట్టి, చుట్టూ ముగ్గులు వేసి ఉండడం చూసి హడలిపోయారు. ఈ ఘటన కుమరం భీమ్ జిల్లాలోని బెజ్జూరు మండలంలో చోటుచేసుకుంది. ఈ విషయం ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్లో అలజడి రేపింది. నిన్న అమావాస్య కావడంతో అర్థరాత్రి క్షుద్రపూజలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
పొద్దున్నే ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో ఒక్కసారిగా ఉలిక్కిపడే వార్త వ్యాపించింది. చుట్టు పక్కల ఊర్లల్లో సైతం ఆ ఘటన గురించే మాట్లాడుకుంటున్నారు. అలాంటి ఘటన ఏంటంటే.. కుమరం భీమ్ జిల్లాలోని బెజ్జూరు మండలం ఏటిగూడలో నడిరోడ్డుపై క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. పూజలు అంటే మామూలుగా కాదు.. మనిషి ఎముకలను నడిరోడ్డుపై పెట్టి మరీ పూజలు చేశారు.
రెండు వారాల క్రితం చనిపోయిన ఓ వ్యక్తిని ఏటిగూడలోని ఓ స్థలంలో పాతిపెట్టారు. ఆ సమాధిని తవ్విన గుర్తు తెలియని వ్యక్తులు.. కుళ్లిపోయిన స్థితిలోని శవం నుంచి ఎముకలను వేరు చేసి నడిరోడ్డుపై క్షుద్రపూజలు చేశారు. ఐదుగురు వ్యక్తులు కలిసి అర్థరాత్రి వేళ సమాధిని తవ్వినట్లుగా కొందరు గ్రామస్తులు చెబుతున్నారు. నిన్న అమావాస్య కావడంతో అతీంద్రీయ శక్తులు, మాయలు కావాలని కొందరు ఇలాంటి ముఢకార్యక్రమాలకు పాల్పడుతుంటారు. మరికొందరు.. బాణామతి, చాతబండి వంటి మూఢ నమ్మకాలతో ఇలాంటి పిచ్చ పనులకు పాల్పడుతుంటారని చెబుతున్నారు.
పద్నాలుగు రోజుల క్రితం చనిపోయిన వ్యక్తి ఎముకల్ని తవ్వి మరీ ఈ క్షుద్రపూజలకు పాల్పడడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసిన విచారణ ప్రారంభించారు. ఎవరు ఇలాంటి ఘటనకు పాల్పడ్డారో గుర్తించి, వారికి కౌన్సిలింగ్ ఇస్తామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also Read : చిట్ ఫండ్ పేరుతో కోట్లు కొల్లగొట్టిన మోసగాడు.. కేసీఆర్ కు బంధువా?