BigTV English
Advertisement

Akshara Chit Fund Scam : చిట్ ఫండ్ పేరుతో కోట్లు కొల్లగొట్టిన మోసగాడు.. కేసీఆర్ కు బంధువా?

Akshara Chit Fund Scam : చిట్ ఫండ్ పేరుతో కోట్లు కొల్లగొట్టిన మోసగాడు.. కేసీఆర్ కు బంధువా?

Akshara Chit Fund Scam : తెలంగాణాలో చిట్ ఫండ్ మోసాల్లో బాధితులకు సాయంగా నిలుస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో చిట్ ఫండ్ పేరుతో అనేక బ్రాంచీలు నిర్వహించి వేల మంది దగ్గర డబ్బులు దండుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని తెలిపారు. ప్రజాభవన్ లో ప్రజలతో ముఖాముఖి నిర్వహించిన కోమటిరెడ్డి దగ్గరకు అక్షర చిట్ ఫండ్ బాధితులు క్యూ కట్టారు. అక్షర చిట్స్ పేరుతో తమకు ఘోరంగా మోసం చేశారని లబోదిబోమన్నారు. వారి బాధలు విన్న మంత్రి కోమటిరెడ్డి, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. సామాన్యుల్ని మోసం చేసిన దుర్మార్గులకు గత ప్రభుత్వాలు గట్టి మద్ధతు ఇచ్చాయని, అందుకే వాళ్లు అలా మోసాలకు పాల్పడ్డారంటూ వ్యాఖ్యానించారు.


తెలంగాణలోని ఖమ్మం, వరంగల, కరీంగర్ ప్రాంతాల్లో ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహించిన అక్షర చిట్ ఫండ్ సంస్థ.. ఆయా ప్రాంతాలో వేల మంది దగ్గర నుంచి నెలనెల వసూలు చేసిన సొమ్ముల్ని, తిరిగి వారికి చెల్లించకుండా మోసం చేసింది. ఖాతాదారులు జమ చేసుకున్న సొమ్ముల్ని రియల్ ఎస్టేట్స్ వైపు మళ్లించి భారీగా లాభాలు ఆర్జించింది. అవసరానికి ఆదుకుంటాయని భావించి దాచుకున్న సొమ్ముల్ని సరైన సమయానికి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసింది. దీంతో.. ఏళ్లుగా బాధితులు పోలీసులు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో.. బాధితులంతా కలిసి ప్రజాభవన్ కు వచ్చారు. మంత్రిని కలిసి వారి గోడు వెళ్లబోసుకున్నారు.

దీనిపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. అక్షర చిట్ ఫండ్ స్కాం కూడా అగ్రిగోల్డ్ వ్యవహారం లాంటిదేనని వ్యాఖ్యానించారు. ఈ కేసును గత ప్రభుత్వం కావాలనే తొక్కిపట్టిందని ఆగ్రహించిన మంత్రి.. ఈ వ్యవహారం వెనుక బడా రాజకీయ నాయకులున్నారని ఆరోపించారు. అందుకే.. గతంలో కేసులు నమోదు కాలేదని, ఎక్కడైనా అయినా సరైన చర్యలు తీసుకోలేదంటూ వ్యాఖ్యానించారు. ఇంత మంది బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదంటే ఏ కారణం ఉందని ప్రశ్నించారు. అక్షర చిట్ ఫండ్ మోసానికి పాల్పడిన అక్షర శ్రీనివాస్ కు అన్ని విధాలా కాపాడుకుంటూ వచ్చారని అన్నారు. అక్షర చిట్ ఫండ్ స్కాం పై విచారణ జరపాలని డీజీపీని ఆదేశించామని తెలిపారు.


ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళతామని చెప్పిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. అక్షర చిట్ ఫండ్స్ స్కాం మీద కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పేరాల శ్రీనివాస్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావుకు, మాజీ సీఎం కేసీఆర్ కు బంధువు అవుతారని వెల్లడించారు. ఆ చుట్టరికం కారణంగానే.. అతను అంత పెద్ద స్కామ్ కు పాల్పడ్డాడని, అతన్ని వాళ్లంతా రక్షిస్తూ వస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.

Also Read : సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎన్నిక.. మొదటిసారి దళిత వర్గ నేతకు అవకాశం..

దక్షిణాధి జిల్లాల్లో ఎక్కువగా కార్యకలాపాలు నడిపిన అక్షర చిట్ ఫండ్ సంస్థ దాదాపు రూ.500 కోట్లు కొల్లగొట్టింది. ఆ డబ్బులన్నింటినీ వేరువేరు బినామీల పేరుపై మార్చారని, మరికొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా.. ఈ కేసు చాలా ఏళ్లుగా నడుస్తోంది. అయినా.. ఇప్పటి వరకు ఈ సంస్థపై, దాని కార్యకలాపాలపై పూర్తి స్థాయి విచారణ జరగలేదని, నిందుతుల నుంచి తమ సొమ్ముల్ని ఇప్పించలేదని బాధితులు వాపోతున్నారు.

Related News

Sridhar Babu: యూట పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Big Stories

×