BigTV English

Mallareddy: మల్లారెడ్డి ఎక్కడ..? ఒకప్పుడు ఆయన సోషల్ మీడియాలో ఫుల్ వైరల్.. ఇప్పుడు ఏమైంది..?

Mallareddy: మల్లారెడ్డి ఎక్కడ..? ఒకప్పుడు ఆయన సోషల్ మీడియాలో ఫుల్ వైరల్.. ఇప్పుడు ఏమైంది..?

Mallareddy: ఒకప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి అంటే ఆ హవా వేరే లెవల్‌లో ఉండేది..  ఎక్కడకి వెళ్లినా ఆయన చురుకుదనంతో ఇట్టే నవ్వులు పూయిస్తాడు. 24/7 ఫుల్ జోష్‌లో ఉంటారు. మల్లారెడ్డి తెర మీద కనిపించినా.. ఆయన నోరు విప్పి మాట్లాడిన ఎదురుగా ఉన్నవారు నవ్వక తప్పదు. కాలేజ్ ఫంక్షన్‌లో డ్యాన్స్‌లు ఇలా సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపిన మల్లారెడ్డి.. ఇప్పుడు పొలిటికిల్ సీన్‌లో పెద్దగా కనిపించడం లేదు. ఆయన అసెంబ్లీలో మాట్లాడిన ప్రసంగాలు అయితే యూట్యూబ్‌లో ఒక్కప్పుడు ట్రెండింగ్‌లో ఉండేవి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆయన గురించి తెలియని వారు ఉండరు. అంటే ఆయనకు ఎంత ఫాల్లోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అదే మల్లన్న ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దగా కనిపించడం లేదు.


ఈయనను కొందరు మాస్ మల్లన్నగా పిలుస్తారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడాది కింద ఆయన పెద్ద సోషల్ మీడియా స్టార్. పబ్లిక్‌లో చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆయనకు భలే క్రేజ్ ఉంది. హైదరాబాద్‌లో ఏ చిన్న పిల్లాడిని అడిగినా మల్లన్న గురించి చెబుతారు. మల్లారెడ్డి ఎక్కడికి వెళ్లినా ఆయనతో ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి ఎగబడుతారు. ఓ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సైతం సోషల్ మీడియాలో మల్లన్నకు నాకంటే ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పారు.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా మల్లారెడ్డి రాజకీయాల్లో కూడా చురుకుగా కనిపిస్తుంటారు. ఆయన ఫస్ట్ టైం 2014లో మల్కాజిగిరి ఎంపీగా టీడీపీ నుంచి గెలిచి.. కొద్ది కాలంలోనే టీడీపీ నుంచి బీఆర్ఎస్ చేరారు. 2018లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మేడ్చల్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మంత్రి కూడా అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మినిస్టర్‌గా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ సృష్టించిన మల్లారెడ్డి ఇప్పుడు గమ్మున ఉండిపోయారు. పొలిటికల్ స్పీచ్‌లు లేవు, పవర్ ఫుల్ పంచ్ డైలాగ్‌లు లేవు.. ఒకప్పటి ఆ ఉత్సాహం లేదు. ఎంతో చురుకుగా ఉండే మల్లన్న ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. దీనికి కారణం రాష్ట్రంలో ప్రభుత్వం లేదు.. అలాగే ఆయనకు పెద్ద ఎత్తున విద్యాసంస్థలు ఉండడంతో అధికారిక ప్రభుత్వం నాయకులతో గొడవలు పెట్టుకోవడం ఎందుకని..? ఈ కారణాల పట్లనే మల్లారెడ్డి సైలెంట్ అయ్యారని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.


Also Read: Savings Account Rules: మీరు బ్యాంకుల్లో భారీగా డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త..!!

మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీలు పెద్ద ఎత్తున ఉండడంతో ప్రభుత్వంతో మంచి మెలగాలని.. అందుకు సోషల్ మీడియాలో గమ్మును ఉంటున్నట్లు తెలుస్తోంది. రేవంత్ సర్కార్  ఏర్పడిన తర్వాత మల్లారెడ్డి కర్నాటక డిప్యూటీ సీఎం అయిన డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళదామనే ఆలోచన కూడా చేసినట్లు మాట్లాడుకున్నారు. వ్యాపారాలు కాపాడుకోవడం కోసమైనా మల్లారెడ్డి కాంగ్రెస్ చేరుతారనే ప్రచారం సోషల్ మీడియాలో తెగ జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన ఏ పార్టీలో చేరలేదు.. బీఆర్ఎస్‌లోనే కంటిన్యూ అయ్యారు. మనవరాలి పెళ్లికి సీఎం హాజరు కావడం, వెడ్డింగ్ కార్డు పేరుతో ఏసీ సీఎం చంద్రబాబు నాయుడుని మీట్ అవ్వడం, మొత్తానికి మల్లన్నఏదో సెట్ చేశాడని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా గమ్మునంటున్నారని టాక్. మరి మల్లారెడ్డి మునపటి ఉత్సాహం, జోష్ ఎప్పుడు చూపిస్తారో యూత్ వెయిట్ చేస్తోంది.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×