BigTV English

Shanampudi Saidireddy: అందుకే కాషాయ కండువా కప్పుకున్నా.. శానంపూడి సైదిరెడ్డి వాయిస్ రికార్డింగ్ వైరల్!

Shanampudi Saidireddy: అందుకే కాషాయ కండువా కప్పుకున్నా.. శానంపూడి సైదిరెడ్డి వాయిస్ రికార్డింగ్ వైరల్!

Shanampudi saidireddy Shanampudi Saidireddy Joined in BJP Releated Voice Recording Viral: ఇటీవల కాషాయ కండువా కప్పుకున్న హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ ప్రస్థుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారు దిగి బీజేపీ గూటికి చేరుకున్న సైదిరెడ్డి వాయిస్ రికార్డింగ్ బయటకు వచ్చింది. ఢిల్లీ నుంచి హఠాత్తుగా బిజెపి అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని, నల్గొండ ఎంపీ టికెట్ ఆఫర్ ఇస్తే కాషాయ కండువా కప్పుకున్నానని ఆ వాయిస్ రికార్డింగ్‌లో ఉంది.


తెలంగాణలో మోదీ గాలి వీస్తోందని దాదాపు 10 నుంచి 12 ఎంపీ సీట్లు కమలం గెల్చుకుంటుందని సైదిరెడ్డి అన్నారు. “కేంద్రంలో మళ్లీ బీజేపీ హవా కొనసాగుతుంది. మళ్లీ మోదీనే ప్రధాని అవుతారు. బీఆర్ఎస్ లో పోటీ అంటేనే నేతలు భయపడి పోతున్నారు. ఆర్ధిక బలం ఉన్న రంజిత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి వెనకడుగువేశారు. సీఎం రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ నాయకులే అనుకుంటున్నారు. వారే బీఆర్ఎస్ కు మద్ధతిస్తున్నారు.

Also Read: TDP Second List: రెండో జాబితా ప్రకటించిన టీడీపీ.. 34 మంది అభ్యర్థులు వీరే!


ఈ కుట్రలు, కుతంత్రాలు మనకెందుకు? మీకు తెలియకుండా పార్టీ మారినందుకు క్షమించండి. మీరంతా నన్ను నమ్ముకుని పనిచేయండి. నేను హుజూర్ నగర్‌లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు బీఆర్ఎస్‌కు ఒక్క సర్పంచ్ లేడు. అలాంటి అలాంటి పార్టీని ఎక్కడికో తీసుకొచ్చాం. రెండు రోజుల్లో మిమ్మల్ని కలుస్తా, కార్యాచరణ పై చర్చిస్తా” అంటూ కార్యకర్తలను ఉద్దేశించి సైదిరెడ్డి మాట్లాడిన మాటల వాయిస్ రికార్డింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×