BigTV English

Hyderabad Land: ఎకరం భూమి రూ.70 కోట్లు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సరికొత్త రికార్డు

Hyderabad Land: ఎకరం భూమి రూ.70 కోట్లు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సరికొత్త రికార్డు

Hyderabad Land: హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. నగరంలో స్థలాలకు డిమాండ్‌ను మరోసారి నిరూపించింది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌లో రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ అధికారులు నిర్వహించిన వేలంలో ఒక్క ఎకరం భూమి రూ.70 కోట్లకు పలికింది. ఈ ఎకరాన్ని గోద్రెజ్‌ ప్రాపర్టీ సంస్థ సొంతం చేసుుంది. మొత్తం 7.50 ఎకరలు హౌసింగ్‌ బోర్డుకు రూ.547 కోట్లు ఆదాయం చేరింది. ఒక్క రోజులో జరిగిన ఈ భూమి వేలం ద్వారా, హైదరాబాద్‌ నగర అభివృద్ధి విలువలు ఎంత ఎత్తుకు చేరా యో ప్రపంచం మొత్తం దృష్టిని సాధించేలా చేసింది.


హైదరాబాద్‌ నగరంలో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మియాపూర్‌ వంటివి గత పది సంవత్సరాల్లో చాలా వేగంగా అభివృద్ధి చెందాయి. ఆ ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఈ పరిసరాల్లో ఉద్యోగావకాశాలు, సాంకేతిక సంస్థలు, విద్యాసంస్థలు పెరిగిన కొద్దీ నివాస అవసరాలు మరింత పెరిగాయి. కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌ భౌగోళికంగా మెట్రో రైలు, రహదారి అనుసంధానం, ప్రధాన ఐటి కారిడార్లకు దగ్గరగా ఉండటమే దీని విలువను భారీగా పెంచింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్థలాలు వేలం బాట పట్టగానే దేశవ్యాప్తంగా కొనుగోలు చేసేందుకు పెద్ద రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు పోటీ పడ్డాయి.

తాజాగా తెలంగాణ హౌసింగ్‌ బోర్డు కేపీహెచ్‌బీ 4వ ఫేజ్‌లోని 7 ఎకరాలు 33 గుంటల భూమిని ఈ-వేలం ద్వారా అమ్మకానికి ఉంచింది. ఈ స్థలాన్ని సొంతం చేసుకోవడానికి గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, అరబిందో రియాల్టీ, ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌, అశోక బిల్డర్స్‌ వంటి ప్రముఖ సంస్థలు పోటీ పడ్డాయి. చివరికి గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ విజయం సాధించి, ఎకరానికి రూ.70 కోట్లు చొప్పున మొత్తం రూ.547 కోట్ల భారీ ధరకు ఈ భూమిని సొంతం చేసుకుంది. అధికారుల ప్రకారం, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ ఎంట్రీ హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా హైటెక్‌ సిటీ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే అనేక బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య కేంద్రాలు నిలిచిన నేపథ్యంలో ఈ ఒప్పందం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.


Also Read:Tv Actress : ఒక్కరోజుకు సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్.. వంటలక్కకు పోటీగా నటిగా..!

తెలంగాణ హౌసింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ వీపీ గౌతమ్‌ ఏమన్నారంటే..

ఈ వేలం కోసం గత నెలలోనే నోటిఫికేషన్‌ జారీ చేశారు. బుధవారం నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలంలో దేశవ్యాప్తంగా పేరొందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు పాల్గొన్నాయి. ఎకరానికి కనీస ధర రూ.40 కోట్లుగా నిర్ణయించగా, పోటీ కారణంగా ఈ ధర 46 సార్లు పెరిగిందని ఆయన తెలిపారు. చివరికి గోద్రెజ్‌ అత్యధికంగా ఎకరానికి రూ.70 కోట్ల బిడ్‌ చేసి స్థలాన్ని దక్కించుకుందని చెప్పారు. అలాగే, ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద, మధ్యతరగతి వర్గాల కోసం గృహ నిర్మాణ పథకాలకే వినియోగిస్తామని స్పష్టంచేశారు.

గౌతమ్‌ మరొక విషయాన్ని గుర్తుచేశారు. కేపీహెచ్‌బీలో కమర్షియల్‌ ల్యాండ్‌కు జూలై 30న జరిగిన వేలంలో ఎకరానికి రూ.65.3 కోట్లు ధర పలికిందని చెప్పారు. ఒక నెల వ్యవధిలోనే ధరలు పెరగడం నగరంలో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ కొనసాగుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇక రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌కు చెందిన టౌన్‌షిప్‌లలో ఉన్న బహుళ అంతస్తుల భవనాల విక్రయం ద్వారా మరో రూ.70.11 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి చేరింది.

పోచారం టౌన్‌ షిప్‌లోని రెండు టవర్లు మొత్తం 194 ఫ్లాట్లు, గాజులరామారం లోని ఒక టవర్‌ 112 ఫ్లాట్లు లాటరీ విధానంలో కేటాయించారు. పోచారం లోని 72 ఫ్లాట్లు ఉన్న టవర్‌ను ఎన్ టీపీసీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రూ.13.78 కోట్లకు పొందింది. అదే ప్రాంతంలో 122 ఫ్లాట్లు ఉన్న మరో టవర్‌ను గాయత్రి ఎడ్యుకేషన్‌ అండ్‌ కల్చరల్‌ ట్రస్ట్‌ రూ.30 కోట్లకు సొంతం చేసుకుంది.

గాజులరామారం లోని 112 ఫ్లాట్ల టవర్‌ను ఎఫ్‌సీఐ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రూ.26.33 కోట్లకు దక్కించుకుంది. ఈ విధంగా, ఒకే రోజులో జరిగిన ఈ రెండు వేలాల ద్వారా తెలంగాణ హౌసింగ్‌ బోర్డుకు వందల కోట్ల ఆదాయం చేరింది. ఇది కేవలం ప్రభుత్వ నిధులకే కాకుండా, హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం వృద్ధి ఎంత దూసుకుపోతోందో మరోసారి స్పష్టంగా చూపించింది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సురక్షితం, లాభదాయకమని పెట్టుబడిదారులు నమ్ముతున్నారు. అందుకే ఎటువంటి చిన్న అవకాశం వచ్చినా ఎవరూ వెనకడుగు వేయకుండా అధిక ధరలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు.

Related News

Kishan Reddy Vs KTR: కేటీఆర్‌కు కిషన్‌‌రెడ్డి ఝలక్.. బీఆర్ఎస్ మద్దతు నో, షాకైన బీఆర్ఎస్

MLC Kavitha: కవితకు షాకిచ్చిన బీఆర్ఎస్.. ఆ పదవి నుంచి తొలగింపు, లేఖ విడుదల

Ganesh Aagman Hyderabad: గణేశుడికి గ్రాండ్ వెల్కమ్.. ముస్తాబవుతున్న వీధులు!

Mandula Samuel: నిరూపిస్తే లారీ కింద పడతా.. తుంగతుర్తి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Weather News: దూసుకొస్తున్న వాయుగుండం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్త..!

Big Stories

×