MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు ఎంతవరకు వచ్చాయి? కవితను దూరం పెట్టాలని హైకమాండ్ నిర్ణయించిందా? ఈ క్రమంలో ఆ పదవి నుంచి తొలగించిందా? పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై కవిత ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు? ఇవే ప్రశ్నలు బీఆర్ఎస్ శ్రేణులను వెంటాడుతున్నాయి.
సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. పదేళ్ల పాటు తాను TBGKS గౌరవాధ్యక్షురాలిగా పని చేశానని రాసుకొచ్చారు. కొత్త నియమితులైన కొప్పుల ఈశ్వర్‌కు ఆమె శుభాకాంక్షలు చెప్పారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా ఎన్నిక జరిగిందన్నది ఆమె ఆవేదన. కేవలం రాజకీయ కారణాలతో ఈ ఎన్నిక జరిగిందన్నది ఆమె ప్రధాన ఆరోపణ.
పదేళ్ల పాటు అధ్యక్షురాలిగా చేసిన పనులను వివరించారు. కార్మికుల కోసం పోరాటం చేస్తుంటే తనపై కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. తండ్రికి రాసిన లేఖను తాను అమెరికా వెళ్లినప్పుడు లీక్ చేశారని పేర్కొన్నారు. ఈ తరహా కుట్రలకు పాల్పడుతున్న వారిని బయటపెట్టాలని డిమాండ్ చేస్తే ఈ విధంగా కక్ష తీర్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత, మండలి సభ్యురాలు కవితకు సొంత పార్టీ షాకిచ్చింది. ప్రతిష్ఠాత్మక పదవి నుంచి ఆమెని తొలగించింది. కవిత స్థానంలో ఆ పార్టీ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్‌ను నియమించింది ఆ పార్టీ. సింగరేణి కాలరీస్ కంపెనీలో బీఆర్ఎస్ అనుబంధ ట్రేడ్ యూనియన్- తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలి కవిత ఉండేవారు. ఆమెని ఆ పదవి నుంచి తొలగించింది బీఆర్ఎస్.
ALSO READ: గణేషుడికి గ్రాండ్ వెల్కమ్.. ముస్తాబవుతున్న ప్రాంతాలు
ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. కవిత స్థానంలో కొప్పుల ఈశ్వర్‌ను టీబీజీకేఎస్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. కొప్పుల ఈశ్వర్ నాయకత్వంలో సింగరేణి కాలరీస్ కార్మికులు, ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతుందని ఓ ప్రకటనలో తెలిపింది బీఆర్ఎస్.
సింగరేణికి కొత్త బొగ్గు గనులు, ఆదాయపు పన్నులో మినహాయింపులు, ఢిల్లీలో సింగరేణి బచావో పేరుతో ఉద్యమ పోరాటాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది. బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకునేముందు కవితను గానీ, కార్మిక సంఘం ప్రతినిధులను ఆ పార్టీ సంప్రదించలేదని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఏకపక్షంగా బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ లెక్కన కవితను క్రమంగా దూరం చేసేందుకు స్కెచ్ వేసినట్టు అప్పుడు బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. తాజా నిర్ణయంతో కేటీఆర్-కవిత మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్టు చర్చించుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఆమెని పార్టీ ఆఫీసుకు రానివ్వకుండా ప్లాన్ చేస్తున్నట్లు ఆ పార్టీ నుంచి ఫీలర్లు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో కవిత వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.