Virat Kohli : టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఐసీసీ వారం రోజుల కిందట ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచాడు. కానీ వారం రోజులు తిరిగే సరికి సీన్ మొత్తం మారిపోయింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు స్థానం దక్కలేదు. గత వారం 736 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న కోహ్లీ పేరు గల్లంతు అయింది. కోహ్లీ తోో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 756 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. అతని పేరును పూర్తిగా తొలగించి.. మూడో స్థానంలో ఉనన పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజామ్ ను రెండో స్థానానికి ప్రమోట్ చేయడం విశేషం. టీమిండియా నుంచి శుబ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ మాత్రమే టాప్ 10లో కొనసాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా విరాట్ కోహ్లీ ఆ స్వామిజీ దగ్గరికీ వెళ్లాడు.
Also Read : Vinod Kambli: టీమిండియా మాజీ క్రికెటర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. మాట కూడా పడిపోయింది !
25 ఏళ్లుగా నో ఫుడ్..
ఆ స్వామిజీ మరెవ్వరో కాదండోయ్.. బాబా సత్యనారాయణ. దాదాపు 25 సంవత్సరాలుగా ఆహారం, నీరు లేకుండా జీవించిన నిజమైన మహాదేవ్ భక్తుడు బాబా సత్య నారాయణ్ ను కలవానుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ నీచమైన ఆచారాన్ని ప్రపంచం నుంచి నిర్మూలించడానికి తాను వచ్చాను. జాగో, జాగో మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను అని బాబా సత్యనారాయణ పలు సందర్భాల్లో పేర్కొంటాడు. ముఖ్యంగా దేశంలోకి చోరబడిన అవినీతి, ఉగ్రవాదం ఇతర వ్యాధులు వంటి రుగ్మతలను తరిమికొట్టాలని ప్రజలను కోరుతున్నారు. భారత్ మా కీ ఆరతి కార్యక్రమానికి ప్రసిద్ధి చెందిన బాబా మౌర్య, ఆదివాసీ పిల్లలకు సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాల వారికి విద్యావకాశాలను కల్పించడానికి తన ఏకల్ అభియాన్ ప్రచారంలో ఉన్నారు.
బాబాను విరాట్ కోహ్లీ సందర్శించడం..!
స్వతహాగా తత్వవేత్త అయిన బాబా తనదైన రీతిలో భారతీయ ప్రజల్లో మేల్కొలుపు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. 1965లో మధ్యప్రదేశ్ లోని బయోరా జిల్లాలోని రాజ్ గడ్ లో ఒక సాధారణ పాఠశాల ఉపాధ్యాయుడి కుటుంబంలో జన్మించారు బాబా. పెయింట్ బ్రష్ తో తన అసాధారణ ప్రతిభతో కీర్తిని పొందారు. చిన్న వయస్సులోనే ఎలాంటి అధికారిక శిక్షణ లేకుండానే పెయింట్ ఒక అభిరుచిగా వచ్చింది. బాబా జీ టీవీలో సంస్కారం, భక్తి కార్యక్రమాలకు స్క్రిప్ట్ రచయితనగా ఆరేళ్లకు పైగా పని చేశారు. ఆ సిరీస్ లో చాలా మంది సాధువులను గుర్తించి ప్రోత్సహించారు. ప్రస్తుతం ఆయన కూడా సాధువుగా మారాడు. దాదాపు 25 సంవత్సరాల నుంచి బాబా సత్యనారయణ్ నీళ్లు, ఆహారం లేకుండా ఉంటున్నాడు. ఇక అతన్ని టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ సందర్శించే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.