E-Paper
Advertisement

Rainwater: మణికొండలో అపార్ట్‌మెంట్ వాసుల అద్భుతం.. జలమండలి ప్రశంసల జల్లు..!

Rainwater: మణికొండలో అపార్ట్‌మెంట్ వాసుల అద్భుతం.. జలమండలి ప్రశంసల జల్లు..!
Advertisement

Rainwater: స్వేచ్ఛ బ్యూరో: వేసవి వచ్చిందంటే చాలు నగరవాసులకు నీటి ట్యాంకర్ల టెన్షన్ పట్టుకుంటుంది. వేలాది రూపాయలు కుమ్మరించినా చుక్క నీరు దొరకని పరిస్థితి. సరిగ్గా గత ఏడాది మణికొండ రోడ్‌ నంబర్‌ 26లోని అల్కాపూర్‌ టౌన్‌షిప్‌లోని ‘అనూహర్‌ పర్పుల్‌ ట్యూన్స్‌‘ అపార్ట్‌మెంట్‌ వాసులు కూడా ఇలాంటి గడ్డు కాల్యాన్నే ఎదుర్కొన్నారు. కేవలం ట్యాంకర్ల కోసమే ఏకంగా రూ.90 వేలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అయితే, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనుకున్న ఆ అపార్ట్‌మెంట్‌ వాసులు కేవలం చేతులు ముడుచుకుని కూర్చోకుండా జల సంరక్షణకు నడుం బిగించారు. జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇంటింటి ఇంకుడు గుంత’ ప్రయోగం ఇప్పుడు అద్భుత ఫలితాలను ఇస్తూ నగరంలోని మిగతా సొసైటీలకు ఆదర్శంగా నిలిచింది.

శాస్త్రీయమైన వర్షపు నీటి నిల్వ..

గత ఏడాది ఎదురైన నీటి ఎద్దడిని గుణపాఠంగా తీసుకున్న అపార్ట్‌మెంట్‌ వాసులు శాశ్వత జల భద్రత వైపు అడుగులు వేసి మంచి ఫలితాలు సాధించారు. జలమండలి వాటర్‌ హార్వెస్టింగ్‌ ఓఎస్‌డీ సత్యనారాయణ సంప్రదించి స్వీకరించిన సాంకేతిక సలహాలతో అపార్ట్‌మెంట్‌ ప్రాంగణంలోని బోర్‌వెల్‌ సమీపంలో ఒక శాస్త్రీయమైన వర్షపు నీటి నిల్వ (ఇంకుడు) గుంతను నిర్మించారు. అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌ (పైకప్పు) పై పడే ప్రతి వర్షపు చుక్క వథా కాకుండా, అన్ని పైపులను కేంద్రీకత వ్యవస్థ ద్వారా అనుసంధానించి నేరుగా ఈ ఇంకుడు గుంతలోకి మళ్లించారు. దీనివల్ల వర్షపు నీరంతా భూమిలోకి ఇంకి, భూగర్భ జల మట్టం పెరగడానికి దోహదపడింది.

పెరిగిన బోరు బావుల జలకళ

Advertisement

కొద్ది నెలలకే వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ వినూత్న ప్రయత్నానికి తొలి ఫలితం దక్కింది. కురిసిన ప్రతి వర్షపు నీరు ఇంకుడు గుంత ద్వారా భూగర్భంలోకి చేరి, అడుగంటిన బోర్‌వెల్‌ను రీఛార్జ్‌ చేయడం ప్రారంభించింది. అంతకుముందు ఎండిపోయే స్థితికి చేరిన బోర్లలో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వచ్చింది. సమిష్టి కృషితో ప్రకృతి ప్రసాదించిన వాన నీటిని ఒడిసిపట్టడం వల్ల భూగర్భ జలాలు ఎంత వేగంగా పెరిగినట్లు జలమండలి అధికారులు వెల్లడించారు.

Also read; అమ్మాయిని కిడ్నాప్ చేసే గ్యాంగ్… విలన్ల ఊచకోత చూసే కొద్దీ చూడాలనిపించే క్రైమ్ థ్రిల్లర్

రెండున్నర నెలలుగా ’జీరో’ ట్యాంకర్స్‌..

Advertisement

ఈ రెండు వినూత్న ప్రయోగాల కలయికతో అపార్ట్‌మెంట్‌ జలవనరుల రూపురేఖలే మారిపోయాయి. వర్షపు నీరు, ఆర్‌ఓ వ్యర్థ జలాల నిరంతర రీఛార్జ్‌ కారణంగా ఎండిపోయే దశకు చేరిన అపార్ట్‌మెంట్‌ బోరుబావి మళ్లీ జలకళను సంతరించుకుంది. దీని ఫలితంగా, గత రెండున్నర నెలలుగా ఈ అపార్ట్‌మెంట్‌ వాసులు ఒక్క నీటి ట్యాంకర్‌ కూడా బుక్‌ చేయాల్సిన అవసరం రాలేదు. ప్రతి నెలా అయ్యే వేల రూపాయల మెయింటెనెన్స్‌ ఖర్చు మిగలడమే కాకుండా, అపార్ట్‌మెంట్‌ కమ్యూనిటీకి దీర్ఘకాలిక జల భద్రత లభించింది. పర్యావరణహితమైన ఈ విధానం ద్వారా అటు అపార్ట్‌మెంట్‌ నివాసితులకు ఆర్థిక ఊరట,నివ్వటంతో పాటు జల సంరక్షణ చేకూరాయి. చిన్నపాటి సమాజ భాగస్వామ్యం, సరైన ప్రణాళిక ఉంటే ఎంతటి నీటి సంక్షోభానైనా ఎదుర్కోవచ్చని ఈ విజయం నిరూపించింది.

మనం నీటిని కాపాడితే.. అది మనల్ని కాపాడుతుంది..

ఈ రోజు మనం నీటిని కాపాడితే, రేపు ఆ నీరు మనల్ని కాపాడుతుందని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందేశాన్ని ‘అనుహర్‌ పర్పుల్‌ ట్యూన్స్‌’ వాసులు బలంగా చాటినందున ఆయన అపార్ట్ మెంట్ వాసులను కూడా అభినందించారు. భవిష్యత్తులో నగరంలో భూగర్భ జలాల సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని, ప్రతి ఇల్లు, ప్రతి అపార్ట్‌మెంట్‌లో ఇలాంటి ఇంకుడు గుంతల నిర్మాణం లేకపోతే రాబోయే రోజుల్లో నీటి చుక్క కోసం అల్లాడక తప్పదని ఆయన వెల్లడించారు. పర్యావరణ హితమైన, శాశ్వత నీటి భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలను చేపట్టాలని ఆయన సూచించారు. ఇంకుడు గుంతలు ప్రతి ఇల్లు, అపార్ట్‌మెంట్‌లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Also read: రెయిన్ అలర్ట్.. తెలంగాణలో ఆదివారం భారీ వర్షాలు, హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి

Related News

హైడ్రా కమిషనర్‌ను వెంటనే మార్చండి- హైకోర్టు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ కొత్త కోర్సులు నేర్చుకుంటే జాబ్ పక్కా! – సీఎం రేవంత్

తెలంగాణ విద్యార్థులకు బంపరాఫర్.. నెలకు రూ.1000, ఇంకెందుకు ఆలస్యం

నేడు తెలంగాణలో వర్షాలు, ఏపీలో పిడుగుల‌తోపాటు, మరి హైదరాబాద్ మాటేంటి?

బోర్డర్ చెకింగ్ పేరిట వసూళ్లు.. లారీ డ్రైవర్‌ స్టింగ్ ఆపరేషన్, వెలుగులోకి తెచ్చిన ‘బిగ్‌టీవీ’

ఫలించని ట్రీట్‌మెంట్..BRS మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి, కేసీఆర్ సంతాపం

తుర్కపల్లి తండాలో సాంప్రదాయ తీజ్ పండుగ సంబరాలు..!

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. ఐదుసార్లు దాడి.. ట్రెయినీ ఐపీఎస్ కేసులో సంచలనాలు!

Big Stories

Advertisement
×