E-Paper
Advertisement

అమ్మాయిని కిడ్నాప్ చేసే గ్యాంగ్… విలన్ల ఊచకోత చూసే కొద్దీ చూడాలనిపించే క్రైమ్ థ్రిల్లర్

అమ్మాయిని కిడ్నాప్ చేసే గ్యాంగ్… విలన్ల ఊచకోత చూసే కొద్దీ చూడాలనిపించే క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Survival Thriller movie : ఓటీటీలో బ్రూటల్ సర్వైవల్ థ్రిల్లర్ లను చూడాలని ఉందా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ‘అపూర్వ’ (Apurva) అనే టైటిల్ తో రూపొందిన ఈ మూవీ జియోహాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఉత్కంఠభరితమైన రా అండ్ రస్టిక్ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ కు నిఖిల్ నాగేష్ భట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తారా సుతారియా, అభిషేక్ బెనర్జీ, రాజ్‌పాల్ యాదవ్ ప్రధాన పాత్రలు పోషించారు.

కథలోకి వెళ్తే…

చంబల్ లోయ నేపథ్యంలో సాగే కథ ఇది. అపూర్వ (తారా సుతారియా) మన హీరోయిన్. పక్కా సిటీ అమ్మాయి. తన ప్రియుడు సిద్ధార్థ్ (ధైర్య కర్వా)తో పెళ్లికి రెడీ అవుతుంది. సిద్ధార్థ్ పుట్టిన రోజున అతనికి ఊహించని సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఆమె ఒంటరిగా బస్సులో ఆగ్రాకు ప్రయాణమవుతుంది. కానీ ఆమె ప్రయాణిస్తున్న బస్సు చంబల్ ప్రాంతానికి చేరుకోగానే, అక్కడ దోపిడీలు చేసే నలుగురు క్రూరమైన గ్యాంగ్‌స్టర్ల అడ్డుకుంటారు. ఆ గ్యాంగ్‌లోని సుఖ్ఖా (అభిషేక్ బెనర్జీ) అనే సైకో కన్ను అపూర్వపై పడుతుంది. దీంతో వారు ఆ బస్సును లూటీ చేసి అపూర్వను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. చంబల్ లోయల్లోని పాడుబడిన రహస్య స్థావరంలో ఆమెను దాస్తారు.

Advertisement

ఆ నలుగురు దొంగల ముఠాలో సుఖ్ఖాతో పాటు జుగ్నూ (రాజ్‌పాల్ యాదవ్), బల్లీ, ఛోటా అనే కరడుగట్టిన నేరస్థులు ఉంటారు. వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు, అపూర్వ తీవ్రంగా భయపడుతుంది. కానీ తేరుకుని సమయస్ఫూర్తితో ప్రవర్తిస్తుంది. ఆ స్థావరం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ, ఆ దొంగలతో టామ్ అండ్ జెర్రీ గేమ్ ఆడుతుంది. ఎటువంటి సహాయం అందని ఆ నిర్మానుష్య అడవి ప్రాంతంలో, క్రూర మృగాల లాంటి ఆ నలుగురి నుండి తన శీలాన్ని, ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆమె కేవలం తన తెలివితేటలను నమ్ముకుని పోరాడుతుంది.

ఇక్కడి వరకు ఫస్టాఫ్ సాగుతుంది. సెకండాఫ్ లో కథ ఊహించని ట్విస్టులతో పరుగులు పెడుతుంది. అపూర్వలోని భయం పోయి, బతకాలనే పట్టుదల, ప్రతీకారేచ్ఛ మొదలవుతాయి. ఒక సాధారణ అమ్మాయి, ఆ కరడుగట్టిన చంబల్ దొంగలను ఒక్కొక్కరిగా ఎలా ముప్పుతిప్పలు పెట్టిందనేదే మిగతా కథ. మరి ఆ అమ్మాయి వాళ్ళ నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయట పడిందా ? అక్కడి నుంచి ఎలా తప్పించుకుంది ? తనను కిడ్నాప్ చేసిన వాళ్ళపై ఎలా పగ తీర్చుకుంది ? అన్నది తెరపై చూసి తెలుసుకోవలసిన స్టోరీ. ఇందులో తీవ్రమైన హింస, బూతులు, క్రూరమైన దృశ్యాలు ఉంటాయి. కాబట్టి ఈ సినిమా పెద్దలకు మాత్రమే అని గుర్తు పెట్టుకోండి.

Advertisement

Read Also : సముద్రం మధ్యలో చావును వెతుక్కుంటూ వెళ్ళే ఫ్రెండ్స్… ఈ హార్రర్ మూవీ క్లైమాక్స్ కేక

Tags

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×