E-Paper
Advertisement

Hyderabad : ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం కేసు.. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకే నిందితుడు!

Hyderabad : ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం కేసు.. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకే నిందితుడు!
Advertisement

Hyderabad : హైదరాబాద్‌ ప్రజాభవన్‌ వద్ద బీభత్సం సృష్టించిన కారు కేసులో నిందితుడు బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు సోహైల్‌గా గుర్తించారు పోలీసులు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టి.. కారు ఆగిన వెంటనే అక్కడ నుంచి సోహైల్‌ పరారైనట్లు వెల్లడించారు వెస్ట్‌జోన్‌ డీజీపీ విజయ్‌కుమార్‌. ఘటన సమయంలో కారులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు సోహైల్‌తో పాటు ఇద్దరు యువకులు, మరో ముగ్గురు యువతులు కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో సోహైల్‌ పరారీలో ఉండగా మిగితావారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

అయితే కారు ప్రమాదానికి కారణం తానేనని సోహైల్‌ ఇంట్లో డ్రైవర్‌గా పని చేసే వ్యక్తి పోలీసు స్టేషన్‌ వెళ్లి చెప్పాడని.. ప్రజాభవన్‌ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన సమయంలో కారును తానే డ్రైవ్‌ చేసినట్లు చెప్పాడని తెలిపారు. పోలీసు విచారణలో అసలు కారు నడిపింది సోహైల్‌ అని తేల్చారు. పోలీసులను తప్పుదోవపట్టించేలా సోహైల్‌ ఇంట్లో పనిచేసే డ్రైవర్‌ ప్రయత్నించడాని తెలిపారు. గతంలో జూబ్లీహిల్స్‌లో కూడా ఇదే తరహా కేసు నమోదైందని..ఆ ప్రమాదంలో కూడా వీళ్లే ఉన్నట్లు అనుమానం ఉందని..ఈ విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

Advertisement

అదుపులోకి తీసుకున్న వారిని కోర్టులో హాజరుపరుస్తామని.. పరారీలో ఉన్న సోహైల్‌ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×