E-Paper
Advertisement

Fake e-Challan Scam: చలాన్ మెసేజ్ వచ్చిందా? క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ! వాహనదారులకు సైబర్ క్రైమ్ పోలీసుల వార్నింగ్

Fake e-Challan Scam: చలాన్ మెసేజ్ వచ్చిందా? క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ! వాహనదారులకు సైబర్ క్రైమ్ పోలీసుల వార్నింగ్
Advertisement

Fake e-Challan Scam: “మీ వాహనానికి ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.. వెంటనే ఈ లింక్ క్లిక్ చేసి డబ్బులు చెల్లించండి” అంటూ మీ మొబైల్‌కు మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త! అది ట్రాఫిక్ పోలీసులు పంపిన మెసేజ్ కాదు.. మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేయడానికి సైబర్ నేరగాళ్లు పన్నిన వల. నకిలీ ఈ-చలాన్ (e-Challan) పేమెంట్ లింకుల ద్వారా జరుగుతున్న భారీ మోసాలపై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు సైబర్ క్రైమ్స్ డీసీపీ వి. అరవింద్ బాబు మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

మోసం జరుగుతుందిలా:

Advertisement

సైబర్ నేరగాళ్లు ఎస్ఎంఎస్ (SMS) లేదా వాట్సాప్ (WhatsApp) ద్వారా వాహనదారులకు సందేశాలు పంపిస్తున్నారు. ఆ మెసేజ్‌లోని లింకులు అచ్చం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ల మాదిరిగానే కనిపిస్తాయి. ఆ లింక్ క్లిక్ చేయగానే వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతారు. అది ఎంటర్ చేయగానే పెండింగ్ చలాన్ మొత్తం చూపిస్తుంది. కంగారులో వాహనదారులు డబ్బులు చెల్లించగానే, వారి మొబైల్ ఫోన్లలోకి ప్రమాదకరమైన మాల్వేర్ (Malware) ఇన్‌స్టాల్ అవుతోంది. లేదా బాధితుల బ్యాంకింగ్ వివరాలు హ్యాక్ చేసి, ఖాతాల్లోని డబ్బులను అనధికారికంగా మాయం చేస్తున్నారు.

పాటించాల్సిన జాగ్రత్తలు:

  • అధికారిక వెబ్‌సైట్లే రక్ష: ట్రాఫిక్ చలాన్లను ఎప్పుడూ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు లేదా పేటీయం, టీ-యాప్ ఫోలియో వంటి గుర్తింపు పొందిన యాప్స్ ద్వారా మాత్రమే చెల్లించాలి.

  • లింకులు క్లిక్ చేయొద్దు: వాట్సాప్, సోషల్ మీడియా, ఎస్ఎంఎస్‌ల ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను అస్సలు క్లిక్ చేయకూడదు.

  • గుర్తుంచుకోండి: ఏ ప్రభుత్వ శాఖ కూడా వాట్సాప్ ద్వారా లేదా వ్యక్తిగత మెసేజ్‌ల ద్వారా పేమెంట్ లింకులను పంపదు.

  • వివరాలు చెప్పొద్దు: ధృవీకరణ లేని వెబ్‌సైట్లలో ఓటీపీ (OTP), యూపీఐ పిన్, డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేయకూడదు.

  • సెక్యూరిటీ: మొబైల్ ఫోన్‌లో ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఉండేలా చూసుకోవాలి. యాప్స్ కేవలం ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి.

మోసపోతే ఏం చేయాలి?

Advertisement

ఒకవేళ పొరపాటున లింక్ క్లిక్ చేసి మోసపోతే.. వెంటనే మొబైల్ డేటా లేదా వైఫైని ఆఫ్ చేయాలి. వెంటనే బ్యాంకును సంప్రదించి కార్డులు, లావాదేవీలను బ్లాక్ చేయించాలి. ఆలస్యం చేయకుండా 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో కంప్లైంట్ నమోదు చేయాలని డీసీపీ సూచించారు.

Read Also: Bihar Crime: కుక్కను చంపి.. దాని మాంసాన్ని రూ.1000కి అమ్మేసిన మందుబాబు, ఎక్కడంటే?

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×