E-Paper
Advertisement

Hyderabad News: హైదరాబాద్ సిటీవాసులకు అలర్ట్.. 40 గంటలపాటు తాగునీరు బ్రేక్, అమీర్‌‌పేట్ నుంచి మొదలు

Hyderabad News: హైదరాబాద్ సిటీవాసులకు అలర్ట్.. 40 గంటలపాటు తాగునీరు బ్రేక్, అమీర్‌‌పేట్ నుంచి మొదలు
Advertisement

Hyderabad News: హైదరాబాద్ సిటీవాసులకు ముఖ్య గమనిక. బుధవారం నుంచి 40 గంటలపాటు తాగునీరు సరఫరాకు వివిధ ప్రాంతాల్లో అంతరాయం కలగనుంది. ప్రస్తుతం వస్తున్న నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచన చేశారు. ముఖ్యంగా అమీర్‌పేట్ మొదలు వివిధ ప్రాంతాల్లో తాగునీటికి అంతరాయం ఏర్పడనుంది.

హైదరాబాద్ సిటీవాసులకు అలర్ట్ 

Advertisement

హైదరాబాద్ సిటీవాసులకు వాటర్ విభాగం అలర్ట్ చేసింది. బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం రాత్రి 10 గంటల వరకు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.  హైద‌రాబాద్ సిటీకి తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే మంజీరా ఫేజ్-2 లోని కలాబ్ గూర్, పటాన్‌చెరులో 25 ఏళ్లు పైబడిన పాతబడిన హెచ్‌టి-హైటెన్షన్ ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌ను తొలగించనున్నారు. వాటి స్థానంలో కొత్త ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

దీనికితోడు అదే సమయంలో అమీన్‌పూర్ ఎక్స్‌రోడ్ నుండి మాదీనాగూడ వరకు వచ్చే పైప్‌లైన్‌లో లీకేజీలు ఏర్పడ్డాయి. వాటిని అరికట్టి, అవసరమైన చోట్ల ఎంఎస్ బ్యారెల్స్‌ను మార్పిడి చేస్తూ మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న 40 గంటలు వివిధ ప్రాంతాల వాసులు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.

Advertisement

40 గంటలపాటు తాగునీరు సరఫరాకు అంతరాయం

పైన వివరించిన పనులను 11.02.2026 అనగా బుధవారం ఉద‌యం 6 గంట‌ల‌ నుంచి 12.02.2026 అంటే గురువారం రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు చేప‌ట్ట‌నున్నారు. ఈ నేపథ్యంలో 40 గంట‌లు కింద పేర్కొన్న ప్రాంతాల్లో లోప్రెజ‌ర్‌తో నీటిస‌ర‌ఫ‌రా చేయనున్నట్లు తెలిపారు. మ‌రికొన్ని ప్రాంతాల్లో స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం కలుగుతుందని వెల్లడించారు.

తాగునీరు అంత‌రాయం ఏర్ప‌డే ప్రాంతాలను ఒక్కసారి చూద్దాం. ఓ అండ్ ఎం డివిజ‌న్-17లోని ఆర్‌సీ పురం, అశోక్‌న‌గ‌ర్, జ్యోతి‌న‌గ‌ర్, లింగంప‌ల్లి, చందాన‌గ‌ర్, గంగారం, మదీనాగూడ‌, మియాపూర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఓ అండ్ ఎం డివిజ‌న్-22 లోని బీరంగూడ‌, అమీన్‌పూర్, భాగ్యనగర్ కాలనీ ఉన్నాయి. ఇక ట్రాన్‌స్ మిష‌న్ డివిజ‌న్-2లో ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ క‌నెక్ష‌న్లు ఉండనున్నాయి.

ALSO READ: తెలంగాణలో మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధం.. బుధవారం 123 పట్టణ సంస్థలకు పోలింగ్

ఓ అండ్ ఎం డివిజ‌న్-6లోని ఎర్ర‌గ‌డ్డ‌, ఎస్‌ఆర్‌న‌గ‌ర్, అమీర్‌పేట్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఓ అండ్ ఎం డివిజ‌న్-9లో కేపీహెచ్ బీ కాల‌నీ, కూక‌ట్‌ప‌ల్లి, భాగ్యనగర్ కాలనీ ప్రగతి నగర్ వంటివి ఉన్నాయి. పైన పేర్కొన్న ప్రాంతాల్లో వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని పేర్కొన్నారు.

Related News

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

Big Stories

Advertisement
×