Ram Charan – Pawan Kalyan : సినిమా కథ, కథాంశం వంటి విషయాలను పక్కన పెడితే కొన్ని కాంబినేషన్స్ అనౌన్స్ చేయగానే విపరీతమైన అంచనాలు పెరిగిపోతాయి. అటువంటి భారీ అంచనాల మధ్య వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలానే సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కొన్ని డేట్స్ అసలు కలిసి రావు. ముఖ్యంగా ఈ రోజు డేట్ కు ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర మొత్తం తవ్వి తీయకపోయినా.. ప్రస్తుతం ఉన్న సినిమా ప్రేమికులకు ఈ డేట్ ఎంత డేంజర్ అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ డేట్ న రిలీజ్ అయిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయాయి. ఇప్పుడు మరో సినిమా ఆ లిస్టులో యాడ్ అయిందా.? అనే అనుమానాలు మొదలయ్యాయి.
బాధితుడు నెంబర్ 1 మహేష్ బాబు…
సుకుమార్ టాలెంట్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి సుకుమార్ మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు అంటే అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దానికి తోడు మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాలో స్టిల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ గా అనిపించాయి. సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చాలామంది ఊహించారు. హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది అని ప్రిన్స్ అభిమానులు కూడా కలలు కన్నారు. కట్ చేస్తే జనవరి 10న ఆ సినిమా విడుదలైంది. ఊహించిన విధంగా డిజాస్టర్ అయింది. కానీ ఇప్పటికీ నేనొక్కడినే సినిమాకి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2014 జనవరి 10న విడుదలైంది. సినిమా మొదటి షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ కొంతమంది ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది అని బాధపడుతుంటారు. కానీ ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి.
ఇప్పటి డిప్యూటీ సీఎం కూడా ఒకప్పుడు బాధితుడే
ఇక ఆ సినిమా గురించి పక్కన పెడితే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన సినిమా అజ్ఞాతవాసి. వీరిద్దరి కాంబినేషన్ పై విపరీతమైన అంచనాలు ఉండేవి. దీనికి కారణం పవన్ కళ్యాణ్ తో పని చేసిన ప్రతి డైరెక్టర్ తనకి రెండవ సినిమా డిజాస్టర్ ఇస్తే, కేవలం త్రివిక్రమ్ మాత్రం అత్తారింటికి దారేది సినిమాతో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ను పవన్ కళ్యాణ్ ఖాతాలో వేశాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే, అత్తారింటికి దారేది సినిమా చరిత్రను తిరగరాసే అత్యధిక కలెక్షన్స్ అప్పట్లో వసూలు చేసింది. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు అంటే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. చాలాచోట్ల సినిమా హౌస్ ఫుల్. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వగానే మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు దానిని మర్చిపోలేరు. ఎందుకంటే గుర్తుపెట్టుకోవడానికి అది జ్ఞాపకం కాదు గురూజీ దించిన గుణపం. ఈ సినిమా కూడా జనవరి 10న నేటికీ ఈ సినిమా విడుదలై ఏడు సంవత్సరాలయింది.
ఇప్పుడు గ్లోబల్ స్టార్ కూడా…
ట్రిబుల్ ఆర్ వంటి సినిమా తర్వాత రామ్ చరణ్ కంప్లీట్ రోల్ లో కనిపించిన సినిమా గేమ్ చేంజర్. శంకర్ వంటి దిగ్గజ దర్శకుడు తెలుగులో చేసిన మొదటి సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటేనే నెక్స్ట్ లెవెల్ లో అంచనాలు ఉండేవి. ఈ సినిమా పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి మంచి హిట్ అయ్యాయి. లేకపోతే ఎట్టకేలకు సినిమా ప్రేక్షకులు ముందుకు నేడు వచ్చింది. అయితే సినిమా ప్రథమార్ధం మంచి టాక్ ని సొంతం చేసుకుంది. అయితే చాలామంది ఇంటర్వెల్ అద్భుతంగా ఉంది సెకండ్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అనే ఊహించి పాజిటివ్ టాక్ వస్తుంది అనుకున్నారు. కానీ చాలా డిఫరెంట్ గా ఈ సినిమాకి ఇప్పటికే మిక్సిక్ టాక్ రావడం మొదలైంది.
బాబాయ్… అబ్బాయి
దీంతో కొంతమంది ట్విట్టర్ వేదికగా అప్పట్లో బాబాయ్ దెబ్బేసాడు ఇప్పుడు అబ్బాయి దెబ్బేసాడు అంటూ ఓపెన్ గా కామెంట్ చేయడం కూడా మొదలుపెట్టారు. ఏదైనా గేమ్ చేంజెర్ సక్సెస్ లో అజ్ఞాతవాసిని మర్చిపోతారు అనుకుంటే గేమ్ చేంజర్ మిక్స్డ్ టాక్ వలన దాన్ని గుర్తుపెట్టుకుని మరి బాధపడుతున్నారు. ఏదే మైనా ఈ డేట్ కలిసి రావట్లేదు అనేది కూడా మరోసారి ప్రూవ్ అయింది.