Formula E Race Case: ఫార్ములా ఈ-రేసు కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. కేసు నమోదు చేసిన ఏసీబీ, రంగంలోకి దిగేసింది. శుక్రవారం ఉదయం విచారణ మొదలుపెట్టేసింది. అప్పట్లో జరిగిన ఒప్పంద పత్రాల ఫైళ్లను పరిశీలించారు. ఈ క్రమంలో ఐఏఎస్‌ల నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.
ఈ వ్యవహారంపై ఓ వైపు ఈడీ ఫోకస్ చేసింది. విదేశాలకు నిధులు చెల్లించడంతో కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు సిద్దమవుతోంది. పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేయనుంది. అయితే ఈ కేసు సంబంధించి పూర్తి వివరాలు పంపాలని ఏసీబీకి లేఖ రాసింది.
ఎఫ్‌ఐఆర్ కాపీతోపాటు HMDA అకౌంట్ నుంచి ఎంత మొత్తంలో నిధులు బదిలీ చేసిన వివరాలు కోరింది ఈడీ. ఐఏఎస్ దాన కిశోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని అందులో ప్రస్తావించింది. ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాల డీటేల్స్ కోరింది ఈడీ.
ఎలాంటి అనుమతి లేకుండా విదేశీ కంపెనీకి రూ. 55 కోట్లు రెండు విడతలుగా బ్యాంక్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా ఎందుకు చెల్లింపులు జరిపారన్నది మొదటి పాయింట్.
ALSO READ: కారు పార్టీకి 2025 ఏడాది కష్టాలు.. అతి విశ్వాసమే కొంప ముంచిందా?
ఫైల్స్‌పై ఎవరెవరు సంతకాలు చేశారు? నిధులు ఏయే కంపెనీలకు వెళ్లాయి? అనేదానిపై ఏసీబీ దృష్టి పెట్టింది. ఇప్పటికే కొంత సమాచారం ఏసీబీ దగ్గరుంది. అయితే మనీ లావాదేవీలకు సంబంధించిన డీటేల్స్ సేకరించగానే కేటీఆర్‌ను అదుపులోకి తీసుకోవడం ఖాయమని అంటున్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకే నిధులు ట్రాన్స్‌ఫర్ చేశామన్నది అధికారుల మాట.